శాకుంతలం సినిమాతో మరోసారి ప్రేక్షకులకు తన టాలెంట్ చూపించేందుకు వస్తుంది సమంత. గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో సమంత ఉత్సాహంగా పాల్గొంటుంది. లేటెస్ట్ గా శాకుంతలం స్పెషల్ చిట్ చాట్ లో భాగంగా ఆమె మలయాళ నటుల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తనకు నటన మీద డౌట్ వచ్చిన ప్రతిసారి మలయాళ సినిమాలు చూస్తానని చెప్పారు.
సూపర్ డీలక్స్ సినిమాలో ఫాహద్ ఫాజిల్ నటన తనకు చాలా ఇష్టమని. ప్రతి మలయాళ నటుడు గ్రేట్ పర్ఫార్మర్ అని అన్నారు సమంత. వారితో మళ్లీ మళ్లీ పనిచేయాలని అనిపిస్తుందని అన్నారు. శాకుంతలం సినిమా కథ విన్నప్పటి నుంచి సినిమా చేసేందుకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. గుణశేఖర్ గారు ఈ సినిమాను చాలా గొప్పగా తెరకెక్కించారు. సినిమా అందరిని అలరిస్తుందని చెప్పుకొచ్చారు సమంత.
బాలీవుడ్ లో కూడా శాకుంతలం సినిమాను భారీగా ప్రమోట్ చేస్తుంది సమంత. అక్కడ ఆల్రెడీ ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సీరీస్ తో అలరించిన సమంత పుష్ప లో ఉ అంటావా మావా సాంగ్ తో అదరగొట్టింది. ఇప్పుడు శాకుంతలం సినిమాతో మరోసారి హిందీ ఆడియన్స్ ని అలరించడానికి సిద్ధమైంది. శాకుంతలం లాంటి సినిమాలు ప్రతి నటికి లైఫ్ లో ఒక్కసారి వచ్చే ఛాన్స్ అని.. ఈ సినిమా చేయకపోతే తను చాలా మిస్ అయ్యే దాన్ని అంటున్నారు సమంత.
శాకుంతలం తో పాటుగా విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తున్నారు సమంత. శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తున్న ఖుషి సినిమా క్రేజీ లవ్ స్టోరీగా వస్తుంది. సినిమా నుంచి వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సమంత శాకుంతలం తర్వాత నెక్స్ట్ బిగ్ రిలీజ్ ఖుషి అని చెప్పొచ్చు. ఆల్రెడీ విజయ్ తో మహానటి సినిమా చేసిన సమంత ఖుషితో కాంబో రిపీట్ చేసింది.