పెళ్లి తర్వాత బాలీవుడ్ లో సమంత?

Update: 2017-10-04 04:25 GMT
టాలీవుడ్ లేటెస్ట్ ఫేవరెట్ కపుల్ నాగచైతన్య - సమంతల వివాహానికి అంతా సిద్ధమైంది. ఈనెల 6న గోవాలో జరిగే పెళ్లికి అత్యంత సన్నిహితులైన వారికే ఆహ్వానాలు అందాయి.  పెళ్లి పనులన్నీ కాబోయే జంట దగ్గరుండి చూసుకుంది. సమంత తెలుగు - తమిళ సినిమాల్లో పూర్తి చేయాల్సిన కమిట్ మెంట్లు ఇంకా ఉన్నప్పటికీ పెళ్లి సందర్భంగా వాటన్నింటిని కొన్నాళ్లు పక్కనెట్టింది.

పెళ్లి తర్వాత సమంత యాక్టింగ్ కంటిన్యూ చేస్తుందా.. లేదా అనే ప్రశ్న ఆమెకు ఎప్పటి నుంచో ఎదురవుతూనే ఉంది. ఆమె తాను సినిమాలు మానేయడం లేదని గట్టిగా చెప్పినా ఆ ప్రశ్న రావడం మానలేదు. తన ఫియాన్సీ నాగచైతన్య కూడా ఈ విషయంలో తనకు సపోర్టివ్ గానే ఉన్నాడని.. అందువల్ల సినిమాలు కంటిన్యూ చేస్తాననే చెబుతోంది. కాబోయే మామగారయిన నాగార్జున లేటెస్ట్ గా ఓ ఇంట్రస్టింగ్ విషయం బయటపెట్టాడు. సమంత నటన కొనసాగిస్తుందని ముందునుంచే చెబుతున్నా.. పెళ్లి తర్వాత ఆమె బాలీవుడ్ లో అడుగు పెట్టనుందని చెప్పాడు. రోనీ స్క్రూవాలా ప్రొడక్షన్ లో వచ్చే సినిమాలో ఆమె నటించనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మిగిలిన వివరాలేవీ నాగ్ బయటపెట్టలేదు.

సమంత సౌత్ లో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నా ఇంతవరకు బాలీవుడ్ లో నటించే ఆలోచన గురించే బయటపెట్టలేదు.  ఓ సౌత్ హీరోయిన్ పెళ్లి చేసుకున్నాక హిందీలో హీరోయిన్ గా నటించడం అన్నది అరుదైన రికార్డుగానే చెప్పాలి. ఆ రికార్డును సమంత సాధించబోతోంది. వెల్ డన్ సమంతా.
Tags:    

Similar News