కెరీర్ ఆరంభంలో అందాల ఆరబోతతో ప్రేక్షకులను అలరించి - స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ డాల్స్ గా నటించే హీరోయిన్స్ స్టార్ డం తగ్గిన తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు కమిట్ అవుతూ ఉంటారు. తెలుగులో విజయశాంతి తర్వాత ఆ స్థాయిలో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు సూట్ అయిన ముద్దుగుమ్మ అనుష్క మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లేడీ ఓరియంటెడ్ మూవీ అంటే హీరో లేకుండా హీరోయిన్ సినిమాను తన భుజస్కందాల మీద వేసుకుని నడిపించాల్సి ఉంటుంది. అలాంటి సత్తా అనుష్క తర్వాత మరే హీరోయిన్ లో ఇప్పటి వరకు కనిపించలేదు.
తెలుగులో అనుష్క తర్వాత ఎంతో మంది లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేశారు. తాజాగా సమంత కూడా ‘యూటర్న్’ చిత్రంతో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు శ్రీకారం చుట్టింది. యూటర్న్ చిత్రంకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం నెగటివ్ లో ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లకు ఈ చిత్రం ఏకంగా మూడున్నర కోట్ల వరకు నష్టాలను మిగిల్చినట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ రాకపోవడంకు కారణం స్టార్ కాస్టింగ్ లేకపోవడమే అంటున్నారు.
ఇదే తరహాలో అనుష్క నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రానికి వచ్చి ఉంటే భారీగా కలెక్షన్స్ వచ్చి ఉండేవి. ఆమద్య అనుష్క హీరోయిన్ గా వచ్చిన భాగమతి చిత్రం మంచి టాక్ ను రాబట్టలేక పోయింది. కాని అనుష్కకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆచిత్రం భారీగా ఓపెనింగ్స్ రాబట్టింది. కాని సమంతలో ఆ సత్తా లేదని తేలిపోయింది. సమంత ముందు ముందు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసినా కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. హీరో పక్కన అయితేనే సత్తా చాటగల సమంత సోలోగా మాత్రం అంత స్టామినా చూపించలేక పోవచ్చు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.