నాకు టాలీవుడ్ నుంచి సరైన ఆఫర్స్ రావడం లేదు.. రీసెంట్ గా సమంత ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. నాగ్ కోడలిని కానుండడంతో.. అసలు ఆఫర్స్ రావడం లేదని కూడా అనేసింది. కానీ అటు శామ్ సందేహాలను పటాపంచలు చేస్తూ.. ఓ అద్భుతమైన ఆఫర్..అందులోనూ పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న ఓ రోల్ సమంత దగ్గరకు చేరిందని తెలుస్తోంది.
మహానటి సావిత్రి జీవిత చరిత్రను 'మహానటి' అనే పేరుతో తెరకెక్కించేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను దాదాపు ఏడాది నుంచి సిద్ధం చేసుకున్న ఈ ఎవడే సుబ్రమణ్యం దర్శకుడు.. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేశాడని తెలుస్తోంది. రీసెంట్ గా సమంతను కలిసిన నాగ్ అశ్విన్.. చాలా సేపు మాటామంతీ జరిపాడు. దీంతో సావిత్రి పాత్రకు సమంతను అడిగాడనే టాక్ మొదలైంది. నిజానికి ఈ రోల్ ను నిత్యామీనన్ తో చేయిస్తారనే ప్రచారం గతంలో జరిగింది.
అయితే.. సావిత్రి పాత్రను చేయాల్సిందిగా సమంత అడిగేందుకు నాగ్ అశ్విన్ ఆమెను కలిశాడా.. లేక వేరే మరేదైనా పాత్ర కోసమా.. ఇంకో ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు జరిపారా అనే విషయంపై క్లారిటీ లేదు. దీంతో.. సావిత్రి సస్పెన్స్ మాత్రం స్టిల్ కంటిన్యూ అవుతోంది.