త్రివిక్రమ్ మాయో ఏమో! ఇటీవలి కాలంలో సమంత కొత్తగా కనిపిస్తోంది. తొలి చిత్రంతో క్యూట్ జెస్సీగా ఆకట్టుకున్న ఈ భామ కెరీర్ పయనంలో ఎంతో దూరం వచ్చేసింది. ఇప్పుడు తనలో పరిణతి చెందిన నటి కనిపిస్తోంది. క్యూట్‌నెస్‌ని మించి ఇంకేదో ఆకట్టుకుంటోంది. ఇంటెలిజెంట్ డైరెక్టర్ త్రివిక్రమ్ వరుసగా రెండు సినిమాల్లో సమంతకే అవకాశం ఇచ్చాడంటే తన మేధోతనానికి తగ్గట్టే సమంత ఆలోచనలు ఉండడమే కారణం కావచ్చు.
అంతేకాదు త్రివిక్రమ్ చదువరి, సంస్కారం తెలిసినవాడు కాబట్టి సమంత వ్యక్తిత్వం, సామాజిక బాధ్యతతో కూడిన ప్రవర్తన నచ్చి పదే పదే అవకాశాలిస్తున్నాడని అనుకోవచ్చు. అప్పట్లో అత్తారింటికి దారేది చిత్రంలో సమంతకి చక్కని పాత్రలో నటించే అవకాశం ఇచ్చాడు. సినిమా ఆద్యంతం పవన్‌తో పోటీపడుతూ నటించే క్యారెక్టర్లో ఛాన్సిచ్చాడు. ఇప్పుడు మరోసారి బన్ని సరసన సన్నాఫ్ సత్యమూర్తిలో నటించే అవకాశం ఇచ్చాడు. మందు కొడుతుంది. సిగరెట్ దమ్ము కొడుతుంది. ఉన్నట్టుండి సుగర్ పేషెంట్లా విలవిలలాడుతుంది. మసకబారిన కళ్లలో లోకాన్ని కొత్తగా చూస్తుంది. మంచిని ప్రేమిస్తుంది.. ఇన్ని విలక్షణాలు చూపించాడు ఆ పాత్రలో.
ఈ సినిమాలో సమంత మునుపటి కంటే సెక్సీగా కనిపించింది. చిట్టి పొట్టి గౌనులు, నిక్కర్లలో కనిపించింది. పైగా చాలా సన్నివేశాల్లో ఆహార్యం చాలా బావుందే అనిపిస్తుంది. అదాశర్మ, నిత్యామీనన్ లాంటి క్యూట్ భామలు మరో ఇద్దరు ఉన్నా తన ప్రత్యేకతను నిలబెట్టుకోగలిగిందంటే అది త్రివిక్రమ చలువే. కాకపోతే ఈ గ్లామరసం జనాలకు ఆనలేదు మరి.