మొన్నటికి మొన్న రంగస్థలం మొదటి టీజర్ బయటికి వచ్చింది. అందులో చిట్టిబాబు తప్ప సమంత ఎక్కడా కనిపించలేదు. దీంతో మూతి ముడుచుకున్నారు సామ్ అభిమానులు. వాళ్లందరినీ బుజ్జగించేలా వచ్చింది సామ్ స్పెషల్ రంగస్థలం టీజర్. సినిమాలో సమంత లుక్ ను అందంగా, అంతే సహజంగా ఎంత బాగా చూపించారో. కాకపోతే ఒక్క విషయం మాత్రం ఇంకా బయటికి రాలేదు... అదేనండి సామ్ ది మూగ పాత్ర... లేక మాటలొస్తాయా అన్నది.
నడుముపై బిందె పెట్టుకుని వయ్యారంగా నడుస్తున్న రామలక్ష్మిని చూసి చిట్టిబాబు గుండె అదిరిపోతోంది. అందుకే సామ్‌ను చూపిస్తూ వాయిస్ ఓవర్లో చిట్టిబాబు చెబుతున్నట్టు టీజర్ ను విడుదల చేశారు. అబ్బాబ్బా ఏం వయ్యారం అంటూ మొదలైన టీజర్.. సామ్ బట్టలుతికే సీన్ తో పూర్తయింది. ఆ అమ్మాయిని సూత్తంటే మా ఊరికి 18 ఏళ్లు వచ్చినట్టు అనిపిస్తుందండీ అని మురిసిపోతూ చిట్టిబాబు చెప్పిన డైలాగ్ అదుర్స్. ఇక సమంతా ఎప్పటిలాగే అందంగా కట్టి పడేసింది. డీగ్లామరస్ పాత్ర అయినప్పటికీ కవ్వించేటట్టే ఉంది రామలక్ష్మి. ఆ లంగావోణీలో ఎంత సెక్సీగా కనిపించిందో. పక్కా పల్లెటూరి పిల్లగా చక్కగా సెట్ అయిపోయింది.
1985 కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో ప్రేమకథా చిత్రంగా ‘రంగస్థలం’ రూపుదిద్దుకుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై దీనిని నిర్మించారు. ఈ సినిమాలో అనసూయ - ఆది - జగపతిబాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 13 సాయంత్రం 5గం.లకు చిత్రానికి సంబంధించి తొలిపాట విడుదల కానుంది.
Full View