విమర్శ, పొగడ్త దేన్నీ పట్టించుకోను

Update: 2015-03-20 05:44 GMT
విమర్శలకు ఏడ్వడం, పొగడ్తలకు పడిపోవడం సరికాదు.. అంటోంది క్యూట్‌ సమంత. జెస్సీగా తెలుగు యువత మనసులు దోచిన ఈ ముద్దుగుమ్మ వరుసగా టాలీవుడ్‌లో అగ్రహీరోలందరి సరసన నటించేసింది. ఒక్క రామ్‌చరణ్‌ తప్ప మిగతా అందరి సరసన నాయికగా నటించేసింది ఈ భామ. ఆ ఒక్క కోరికా తీరడానికి ఇంకెంతో సమయం పట్టకపోవచ్చు. ఈలోగానే బోలెడంత వేదాంతం మాట్లాడింది అమ్మడు. చేసే పనిని గౌరవిస్తే ఇంకేదీ పట్టించుకోవాల్సిన పనిలేదు. రోజూ విమర్శించేవాళ్లు చుట్టూ ఉంటారు. పొగిడేవాళ్లు ఉంటారు.

అయితే పొగిడేవాడి కంటే తెగిడేవాడే మంచివాడు అని డా.అక్కినేని నాగేశ్వరరావు చెబుతుండేవారు. ఆయన సూక్తిని తూ.చ తప్పక ఆచరిస్తాను.. అని చెప్పింది. అన్నట్టు విమర్శించేవాళ్లంటే తనకి గిట్టదని కూడా పరోక్షంగా అన్నట్టే లెక్క. ఏదేమైనా అసలు సమంతని ఆన్‌సెట్స్‌ పొగిడేవాళ్లెవరో, తెగిడేవాళ్లెవరో క్లారిటీ మాత్రం రాలేదు. ఒకవేళ తెగిడేవాళ్లే మంచి వాళ్లు అనుకుంటే గనుక డియర్‌ సమంత ఆ జాబితాని ఓసారి చెప్పండి. 100లారీల అభిమానుల్ని తోలికెళ్లి పొగిడేవాళ్ల తాట తీద్దాం.

Tags:    

Similar News