ఆ జంట‌ ల‌వ్ లో ఎనిమిదేళ్ల సందిగ్ధ‌త‌?

Update: 2019-03-15 13:09 GMT
అక్కినేని నాగ‌చైత‌న్య - స‌మంత జంట ప్రేమాయ‌ణం గురించి తెలిసిందే. `ఏమాయ చేశావే` చిత్రంతో స‌మంత టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది. యువ‌త‌రం డ్రీమ్ గాళ్ గా వెలిగిపోయిన సామ్ అక్కినేని బుల్లోడు నాగ‌చైత‌న్య మ‌న‌సు దోచేసింది అప్పుడేనా? ఆ త‌ర్వాత‌నా? అన్న సందేహాలున్నాయి. అయితే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఎనిమిదేళ్ల పాటు ప్రేమ దోబూచులాడింద‌ట‌. ఆ స‌మ‌యంలో ఏదో ఒక‌టి తేల్చుకోలేని సందిగ్ధావస్త‌లోనే ఉండిపోయార‌ట ఇద్ద‌రూ.

ఆ ఇద్ద‌రూ కెరీర్ అప్పుడే ప్రారంభించారు కాబ‌ట్టి `ఏమాయ చేశావే` సినిమాలో చూపించిన‌ట్టే ప్రేమ‌.. కెరీర్ అనేవి ఆ ఇద్ద‌రినీ ఆ క‌న్ఫ్యూజ‌న్ లోకి నెట్టేశాయ‌నే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌ఖ్యాత ఫిలింఫేర్ కి ఇచ్చిన లేటెస్ట్ ఇంట‌ర్వ్యూలో స‌మంత మాట్లాడుతూ ``ఒకే పాయింట్ ద‌గ్గ‌ర ఎనిమిదేళ్ల  స‌మ‌యం వేచి చూశాం. నేను అత‌డిని ఇష్ట‌ప‌డిన‌ప్పుడు త‌న ఆలోచ‌న‌లు వేరేగా ఉన్నాయి. ఆ త‌ర్వాత మేం ఒక‌రినొక‌రం అర్థం చేసుకున్న త‌ర్వాత ల‌వ్ కి ఓకే చేద్దామా అనుకుంటే ఊహించ‌ని ఇత‌ర కార‌ణాలు వెయిట్ చేయించాయి. ప్రేమ‌.. పెళ్లి విష‌యంలో అంత‌ సుదీర్ఘ‌మైన స‌మ‌యం తీసుకోవ‌డానికి ఎన్నో కార‌ణాలు ఉన్నాయి`` అని తెలిపారు.

మొత్తానికి ప్రేమ ..  పెళ్లి  .. కెరీర్ బిజీ తో ముడిప‌డి ఉన్నాయ‌ని ఈ జంట విష‌యంలో ప్రూవ్ అయ్యింది. ఏమాయ చేశావే సినిమాతో స్నేహితులు అయినా 2014 నుంచి ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ప్రేమాయ‌ణం టేకాఫ్ అయ్యింది. 2018 అక్టోబ‌ర్ 6న పెళ్లి చేసుకున్నారు. హిందూ - క్రిస్టియ‌న్స్ స్టైల్స్ లో ఈ జంట వివాహం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. గోవాలో డెస్టినేష‌న్ త‌ర‌హా వెడ్డింగ్ ని అక్కినేని ఫ్యామిలీ ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకుంది. ప్ర‌స్తుతం పెళ్లి త‌ర్వాత స‌మంత‌- చైత‌న్య జోడీ న‌టించిన మ‌జిలీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News