సమంత ఇప్పుడేం చేస్తోంది? కొన్ని వారాల క్రితం వరకు శామ్స్ చాలా అంటే చాలా బిజీ. వరుసగా నాలుగు నెలలు విపరీతంగా షూటింగులు చేసేసింది. నాలుగు భారీ చిత్రాలను రిలీజ్ చేసేసింది. కొన్ని హిట్లు కొన్ని ఫట్లు అయినా.. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ కలిసి జనతా గ్యారేజ్ షూటింగ్ లో కూడా పాల్గొంది. ఇప్పుడు జూనియర్ తో చేస్తున్న మూవీకి సంబంధించి పాటలు తప్పితే బ్యాలెన్స్ ఏం లేవు.
అదే సమయంలో.. సమంత కూడా కొత్త సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఒప్పుకోలేదు. వీలైనంత వరకు టేక్ రెస్ట్ పాలసీనే అమలు చేస్తున్న శామ్స్.. చేతిలో ఉన్న ప్రాజెక్టలను కూడా వదిలేసుకుంటూ ఇంట్లో చక్కగా పుస్తకాలతో కాలక్షేపం చేస్తోంది. ఇందులో భాగంగా.. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థపై రాసిన'ది రైజ్ ఆఫ్ ఐసిస్' అనే బుక్ ని చదువుతున్న శామ్స్.. ప్రతీ ఒక్కరూ చదవాల్సిన బుక్ అంటూ.. దాన్ని ఫోటో కూడా తీసి పోస్ట్ చేసింది.
'చదవండి.. మనం ఇలాంటి వ్యతిరేకించాల్సిన భావాలను ప్రేమించాల్సిన అవసరం ఉంది. దీనిపై ఏమైనా పోరాటం చేసేవాళ్లకి కూడా ఇది ఉపయోగమే' అని చెప్పింది సమంత. జే సుకోలో రాసిన ఈ బుక్.. న్యూయార్క్ టైమ్స్ కి బెస్ట్ సెల్లర్ కావడం విశేషం. ఇక సినిమాల సంగతి చూస్తే.. త్వరలో జనతా గ్యారేజ్ కి సంబంధించిన ఓ పాట కోసం శ్రీలంక వెళ్లాల్సి ఉండగా.. ఎన్టీఆర్ తో చేస్తున్న ఈ మూవీతో భారీ సక్సెస్ కొట్టాలని సమంత ఫిక్స్ అయింది.