పారితోషికం.. ఏరియా హ‌క్కుల్లో వాటానా?

Update: 2019-07-04 09:19 GMT
స్టార్ హీరోయిన్ల పారితోషికాలు ఆల్ టైమ్ హాట్ టాపిక్. అనుష్క - త్రిష‌- న‌య‌న‌తార లాంటి స్టార్లు రూ.2కోట్లు పైగానే పారితోషికాలు అందుకున్నారు. అయితే ఆ త‌ర్వాతి జ‌న‌రేషన్ లో స్టార్ గా ఎదిగిన స‌మంత ఎంత పారితోషికం అందుకుంటున్నారు? వ‌రస‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూ వేడి పెంచుతున్న సామ్ ఎంత డిమాండ్ చేస్తోంది? అంటే.. ఇదీ వివ‌రం..

స‌మంత నటించిన `ఓ బేబి` ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. నందిని రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డి.సురేష్ బాబు అండ్ అల‌యెన్స్ నిర్మించారు. అయితే ఈ సినిమాకి స‌మంత ఎంత పారితోషికం అందుకుంటున్నారు? అంటే ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలిశాయి. సామ్ ఇటీవ‌ల ఒక్కో క‌మిట్ మెంట్ కి రూ.2కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నార‌ని స‌న్నిహిత వ‌ర్గాలు రివీల్ చేసాయి. ఓ బేబికి ఇంకో మెట్టు ఎక్కువే అందుకుంటోంద‌ట‌. రూ.2కోట్ల పారితోషికం తో పాటు థియేట్రిక‌ల్ బిజినెస్ లోనూ చిన్న‌పాటి షేర్ ద‌క్క‌నుంద‌ట‌. దాదాపు 13కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన ఓ బేబికి ప్రీబిజినెస్ రూపంలో 11కోట్లు రిట‌న్ వ‌చ్చేసింది. ఇంకా ఏపీ- నైజాం థియేట్రిక‌ల్ రైట్స్ అద‌న‌పు బోన‌స్ అని రివీలైంది.

ఈ స్థాయి బిజినెస్ చేసిన సినిమాకి ఓవ‌రాల్ గా సమంత‌నే ఆ భారం మోస్తోంది. అందుకే త‌న డిమాండ్ మేర‌కు అంత మొత్తం చెల్లిస్తున్నార‌ట‌. `మిస్ గ్రానీ`కి రీమేక్ గా వ‌స్తున్న ఈ సినిమా ష్యూర్ షాట్ గా విజ‌యం సాధిస్తుంద‌ని టీమ్ చెబుతోంది. అయితే ఇటీవ‌ల‌ స‌మంత న‌టించిన సోలో మూవీ `యూట‌ర్న్` ఆశించినంత విజ‌యం అందుకోలేదు. ఆ త‌ర్వాత చైతూతో క‌లిసి న‌టించిన‌ `మ‌జిలీ` ఘ‌న‌విజ‌యంలో మాత్రం స‌మంతకే మెజారిటీ క్రెడిట్ ద‌క్కింది. అందుకే `ఓ బేబి` చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్నారు. చెన్న‌య్ స‌హా త‌మిళ‌నాడులో జీకే సినిమాస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఓ బేబి త‌మిళ వెర్ష‌న్స్ శుక్ర‌వారం ఉద‌యం 8గం.ల నుంచే తెర‌పై ప‌డుతున్నాయ‌ట‌. నేటి సాయంత్రం ప‌లుచోట్ల ప్రివ్యూలకు ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది.

    
    
    

Tags:    

Similar News