వ్యక్తిగత జీవితం వేరు.. వృత్తిగత జీవితం వేరు..! ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయడం అన్నిసార్లు కుదరకపోవచ్చు. కొన్ని ఒడిదుడుకుల అనంతరం సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. నాగచైతన్యతో విడాకుల సమయంలో సమంత తన మనో వేదనను ఇన్ స్టా వేదికగా చెప్పే ప్రయత్నం చేసారు. ఆత్మహత్య చేసుకోవాలన్నంతగా సమంత మానసిక వేదనకు గురైనట్లు ఒకానొక సందర్భంలో తెలిపారు. గతాన్ని మర్చిపోలేక.. వర్తమానంలోకి సమంత మనసు పెద్ద యుద్ధమే చేసింది. ఆ సమయంలో ప్రముఖుల స్పూర్తివంతమైన వ్యాఖ్యల్ని నెమరు వేసుకుంటూ... ఆథ్యాత్మిక మందిరాల్ని సందర్శిస్తూ.. మనసుకు తగిలిన గాయాన్ని మర్చిపోయే ప్రయత్నం చేసింది. తనకు తానుగా బలమైన వ్యక్తిగా మలుచుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది. చైతన్యతో బ్రేకప్ విషయం పక్కనబెడితే సోషల్ మీడియాలో కారణాలు చూపుతూ సమంతను అపరిచితులు ఆడిపోసుకున్నారు.
సామ్ ని టార్గెట్ చేస్తూ తప్పంతా తనదే అన్నట్లు ఎంతో ఒత్తిడి తీసుకొచ్చారు. చివరికి అన్నింటిని అధిగమించి.. క్లిష్ఠ సమయాల్ని ఎదుర్కొని నేడు మళ్లీ కెరీర్ పై ఫోకస్ చేస్తున్నార సామ్. స్టార్ హీరోయిన్ గా తన స్థాయిని నిలుపుకునేందుకు వరుస ప్రాజెక్టులకు కమిటవుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే సమయంతో మరో పోస్ట్ పెట్టింది. ``సులభతరమైన గతం ఉన్న బలమైన వ్యక్తిని నేను ఎప్పుడూ కలవలేదు. నా వ్యక్తిగత జీవితంలో ఎదురు దెబ్బ తగిలిన తర్వాత బలమైన వ్యక్తిగా ఉండాలని అతను నాకు నేర్పించాడు`` అని సమంత తెలిపింది. అలాగే సమంత ఇన్ స్టాలో ఓ కొత్త ఫోటోను పోస్ట్ చేసింది. ఇందులో నటులు రాహుల్..వెన్నెల కిషోర్ ..సమంత ఓ పెద్ద సోఫాలో పక్క పక్కనే పడుకుని ఉన్నారు.
ఈ ఫోటోకి సమంత ``మీరు ఇద్దరు లేకుండా నేను ఏం చేస్తాను`` అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇందులో ఆ ముగ్గురూ చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకి ఫోజులిచ్చారు. దర్శకనటుడు రాహుల్.. వెన్నెల కిషోర్ సామ్ కి మంచి స్నేహితులు. ఆ బాండింగ్ కారణంగానే ఇలా సెల్ఫీ దిగా అభిమానులకు షేర్ చేసారు. అలాగే హిందీలోనూ తాప్సీ నిర్మాణ సంస్థలో మరో లేడీ ఓరియేంటెడ్ చిత్రం కమిట్ అయింది. సమంత షూటింగ్ పూర్తిచేసిన మరో సినిమా `శాకుంతలం` పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.