హీరోలు, హీరోయిన్ల మ‌ధ్య ఎందుకు తేడా : స‌మంత

Update: 2021-03-08 04:30 GMT
‘ఏమాయ చేసావే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్లింది. చాలా త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. ఆ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌ను పెళ్లి చేసుకుని స్టేట‌స్ కూడా పెంచేసుకుంది. ఆ త‌ర్వాత కూడా సినిమాలు, వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే.. తాజాగా ఈ అమ్మ‌డు ఇండ‌స్ట్రీలోని ప్ర‌ధాన అంశంపై ఎలుగెత్తింది.

హీరో, హీరోయిన్ల మ‌ధ్య తేడా ఎందుకు చూపిస్తారంటూ క్వ‌శ్చ‌న్ చేసింది. ముఖ్యంగా రెమ్యున‌రేష‌న్ విష‌యంలో అస‌లు పోలికే ఉండ‌ద‌ని చెప్పింది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన సామ్‌.. త‌న మ‌న‌సులోని భావాల‌ను బ‌య‌ట‌పెట్టింది. పారితోషికం విష‌యంలో హీరోలు, హీరోయిన్ల మ‌ధ్య ఎందుకు తేడా చూపించాల‌ని ప్ర‌శ్నించింది.

తెలుగు ఇండ‌స్ట్రీలో టాప్-20లో కూడా లేని హీరోకు ఇచ్చే పారితోషికానికి.. టాప్‌-3లో ఉన్న హీరోయిన్ కూడా ఇవ్వ‌ర‌ని చెప్పింది. ఇంత తేడా ఏవిధంగా న్యాయ‌మ‌ని ప్ర‌శ్నించింది స‌మంత‌. ఈ విష‌య‌మై ఎవ‌రైనా మాట్లాడితే.. ఎక్కువ రెమ్యున‌రేష‌న్ అడిగితే.. అభ్యంత‌రం చెబుతార‌ని రివీల్ చేసింది. అదే స‌మ‌యంలో హీరోలను మాత్రం ఏమీ అన‌ర‌ని తెలిపింది.

గ‌తంలో సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతి కూడా ఇండ‌స్ట్రీలో హీరో ప‌క్ష‌పాతంపై ప‌లు మార్లు ఫైట్ చేసిన విష‌యం తెలిసిందే. హీరోయిన్ల‌కు స‌రైన రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌ర‌ని, కాస్త పాత‌బ‌డ‌గానే అవ‌కాశాలు కూడా ఇవ్వ‌ర‌ని అన్న‌ది. అదే సంద‌ర్భంలో హీరోల‌కు మాత్రం ఎప్పుడూ ఛాన్స్ లు వ‌స్తూనే ఉంటాయ‌ని, ఇలాంటి తేడా ఎందుకు చూపించాల‌ని ప్ర‌శ్నించింది విజ‌య‌శాంతి. ఇప్పుడు స‌మంత కూడా ఇదే టాపిక్ పై మాట్లాడ‌డం విశేషం.
Tags:    

Similar News