సమంత ఒంటిపై చెరిగిపోని చైతూ గుర్తులు..!

Update: 2022-06-09 07:30 GMT
స్టార్ హీరోయిన్ సమంత తన భర్త అక్కినేని నాగచైతన్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈ సెలబ్రిటీ కపుల్.. నాలుగో వివాహ వార్షికోత్సవం జరుపుకోకముందే విడిపోతున్నట్లు ప్రకటించిన అందరికీ షాక్ ఇచ్చారు.

అప్పటి నుంచి చై-సామ్ ఇద్దరూ ఎవరి దారుల్లో వారు ప్రయాణిస్తున్నారు. వీలైనంత త్వరగా దాన్నుంచి బయటకు రావాలని నిర్ణయించుకొని.. కెరీర్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టారు. అయినప్పటికీ కొన్ని విషయాలు మాత్రం వారి వివాహ బంధాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి.

విడాకుల తర్వాత చైతన్య జ్ఞాపకాలేవీ ఉండొద్దనుకుందో ఏమో.. సమంత తన సోషల్ మీడియా ఖాతాల నుంచి చైతూ ఫొటోలను.. ఇద్దరు సన్నిహితంగా ఉన్న చిత్రాలను డిలీట్ చేసింది. అయితే వీరిద్దరూ డీప్ లవ్ లో ఉన్న సమయంలో వేయించుకున్న టాటూలు మాత్రం తొలగించలేదని తెలుస్తోంది.

సమంత తన బాడీపై మూడ చోట్ల వేయించుకున్న పచ్చబొట్లు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. నాగచైతన్య - సమంత కలిసి నటించిన మొట్టమొదటి సినిమా 'ఏమాయ చేసావే' గుర్తుగా అప్పట్లో సామ్ తన వీపుపై ymc అనే టాటూ వేయించుకుంది.

అలానే తన భర్తతో అనుబంధానికి గుర్తుగా సమంత నడుముకి పైభాగంలో 'చై' అని టాటూ వేయించుకుంది. ఇక తన కుడి చేతి మీద రెండు యారో (బాణం) మార్కులను టాటూగా వేయించుకుంది. ఇలాంటి టాటూ నాగ చైతన్య చేతికి కూడా ఉంటుందనే సంగతి తెలిసిందే.

అయితే విడాకుల ప్రకటన తర్వాత సమంత తన శరీరం పై చైతూ గుర్తులుగా ఉన్న పచ్చబొట్లను సర్జరీ చేయించుకొని తొలగించుకున్నట్లు ఆ మధ్య రూమర్స్ వినిపించాయి. కానీ ఆ టాటూలు ఇంకా ఆమె ఒంటిపై అలానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో సామ్ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. లేటెస్టుగా షేర్ చేసిన ఓ ఫొటోలో ఆమె నడుముకు పై భాగాన పచ్చబొట్టు కనిపించింది. దీంతో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈమధ్య కాలంలో సమంత నటించిన సినిమాలలో కూడా టాటూలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అయితే తొలగించుకునే అవకాశం లేకపోవడంతోనే సామ్ వాటిని ఇంకా ఉంచుకుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఇన్స్టాగ్రామ్ చిట్ చాట్ నిర్వహించిన సమంత.. టాటూలపై కీలక వ్యాఖ్యలు చేసింది. 'మీరు ఎప్పటికైనా వేసుకోవాలన్న టాటూ ఏంటి' అని సమంత ను ఓ నెటిజన్ ప్రశ్నించాడు.

దీనికి సమంత సమాధానమిస్తూ.. అసలు టాటూ వేయించుకోవాలనే ఆలోచనే మానుకోండి.. లైఫ్ లో ఎప్పుడూ టాటూ వేయించుకోకూడదు అని తెలిపింది. 'పచ్చబొట్టు చెరిగిపోదులే..' అని పాడుకున్నట్లే సమంత తన భర్త నుంచి విడిపోయినా టాటూలు మాత్రం తొలగించుకోలేకపోతోందని.. అందుకే టాటూలు వేయించుకోవద్దని సలహా ఇస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేశారు.
Tags:    

Similar News