సౌత్ బ్యూటీ సమంత సమంత పెళ్లి ఎప్పుడు? ఇకపై సినిమాలు చేస్తుందా చేయదా? ఇలాంటి రకరకాల డౌట్స్ ఆడియన్స్ లో ఉన్నాయి. పెళ్లి గురించయితే జనాల దగ్గర ఓ క్లారిటీ ఉంది. కానీ సినిమా విషయంలోనే ఇప్పుడు శామ్స్ ఓ క్లారిటీ ఇచ్చింది.
జనతా గ్యారేజ్ లో సమంత చేయాల్సింది ఇంకా ఒక పాట మాత్రమే. ఆ ఒక్కటి పూర్తైపోతే.. ఇక సమంతకి కమిట్మెంట్స్ ఏం లేదు. ఇక ఆమె కెమేరా ముందుకు రాదా అనుకుంటున్నారు. ఇలా అర్ధాంతరంగా సినిమాలకు గుడ్ బై చెప్పేయడం సమంతకు నిజానికి ఇష్టంలేదు. ఆమె 'యూటర్న్' అనే ఓ మూవీ చేయాలని అనుకుంటోంది. తెలుగు, హిందీల్లో తీసేసి.. మరికొన్ని భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసి.. తనకు తాను గ్రాండ్ ఫేర్ వెల్ ఇచ్చుకోవాలన్నది సమంత ఆలోచన.
'జనతా గ్యారేజ్ నా ఆఖరి సినిమా కాదు. నేను ఇంకా చాలాకాలం సినిమాల్లో ఉండాలని అనుకుంటున్నా..' అని చెప్పిన సమంత.. 'డిసెంబర్ లో పెళ్లి చేసుకంటున్నారా' అని ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నో అనేసింది. ఈ లెక్కన సమంతకు ఇంకా సినిమాల్లో నటించే ఉద్దేశ్యం ఉందని అనుకోవాలి. అందుకే ట్విట్టర్ సాక్షిగా తాను ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకోవడం లేదని చెప్పుకొచ్చింది. ఆ లెక్కన యూటర్న్ తో సమంత కెరీర్ కి శుభంకార్డు పడుతుందని అనుకోవచ్చు.