మహేష్ బాబు-మురుగదాస్ సినిమా మొదలు కాకముందు ఈ సినిమా టైటిల్ ‘ఎనిమీ’ అన్నారు.. ప్రారంభోత్సవ సమయంలో ‘ఏజెంట్ శివ అన్నారు.. ఆపై ‘అభిమన్యు’ అంటూ ఇంకో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. కానీ అవేవీ కూడా ఫిక్సవలేదు. టైటిల్ ఏదైనా.. అందులో శివ అన్న పదం ఉండాల్సిందే అని మురుగదాస్ పట్టుబడుతున్నట్లు ఈ మధ్య వార్తలొచ్చాయి. ఐతే ఇప్పుడు అలాంటిదేమీ లేకుండా ఒక కొత్త టైటిల్ తెరమీదికి వచ్చింది. మహేష్-మురుగ సినిమాకు ‘సంభవామి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ఇదేమీ ఉత్తుత్తి ప్రచారం కూడా కాదు. స్వయంగా ఈ చిత్ర నిర్మాతలే ఫిలిం ఛాంబర్లో సంభవామి అనే టైటిల్ రిజిస్టర్ చేయించడంతో అదే సినిమా పేరు కాబోతోందని అంటున్నారు. ‘అర్జున్’ సినిమా ఇంట్రడక్షన్ సాంగ్ లో మహేష్ నోట సంభవామి అనే మాట వినిపిస్తుంది. వినడానికి బాగా అనిపించే టైటిలే కావడంతో ఇదే ఫిక్సయినా ఆశ్చర్యం లేదు. ఐతే తమిళంలోనూ ఇదే టైటిల్ పెడతారా.. లేక దానికి వేరే టైటిల్ ఫిక్స్ చేస్తారా అన్నది చూడాలి. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం అహ్మదాబాద్ లో నిర్విరామంగా జరుగుతోంది. రాత్రి పూట యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నాడు మురుగదాస్. ఈ షెడ్యూల్ అవగానే సినిమా దాదాపుగా పూర్తయినట్లే. జనవరిలోనే గుమ్మడికాయ కొట్టేసి.. ఫిబ్రవరిలో కొరటాల శివ సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నాడు మహేష్.