ఈసారి క‌థ చెప్పానంటున్న ద‌ర్శ‌కుడు

Update: 2017-07-27 17:30 GMT
క‌థ లేక‌పోతే సినిమానే లేదు. ఎక్క‌డైనా క‌థ త‌ర్వాతే క‌మ‌ర్షియాలిటీ గురించి ఆలోచిస్తుంటారు.  కానీ తెలుగు ద‌ర్శ‌కులు క‌థ కంటే క‌మ‌ర్షియాలిటీనే కీల‌కం అనుకొంటుంటారు. తెలుగులో ఆ త‌ర‌హా చిత్రాల‌కి ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌డ‌మే అందుకు కార‌ణం. అందుకే నిన్న మొన్న‌టిదాకా  స్టార్ హీరోల‌తో సినిమా అంటే క‌మ‌ర్షియ‌ల్ అంశాల్ని మేళ‌వించి ఓ క‌థ‌ని వండేస్తే స‌రిపోద్ది అన్న‌ట్టుగా ఉండేది ప‌రిస్థితి. కానీ ఈమ‌ధ్య ప్రేక్ష‌కులు కంటెంట్‌కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాంతో ద‌ర్శ‌కులు క‌థ‌ల‌పై దృష్టిపెడుతున్నారు. దాని మ‌ధ్య‌లో క‌మ‌ర్షియల్ అంశాల్ని జోడిస్తూ ఫ్యాన్స్‌ని మురిపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా సంప‌త్ నంది కూడా `ఈసారి క‌థే చెప్పాన`ని చెబుతున్నాడు.

గోపీచంద్‌ తో  `గౌత‌మ్‌ నంద‌` తెర‌కెక్కించారాయ‌న‌. శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది ఆ చిత్రం. ఈ సంద‌ర్భంగా  గురువారం సంప‌త్ నంది  మీడియాతో మాట్లాడారు. ``నేను చేసిన గ‌త సినిమాల్లో క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్లే కీల‌కం. కానీ ఈసారి ఒక మంచి క‌థ చెప్పాను. అందుకే గౌత‌మ్ నంద సినిమాని ప్ర‌త్యేకంగా భావిస్తున్నా`` అని చెప్పుకొచ్చాడు. అలాగే గౌత‌మ్ నంద సినిమాలో హీరో ఇంటిపేరు ఘ‌ట్ట‌మ‌నేని అని పెట్ట‌డంపై కూడా ఆయ‌న స్పందించారు. ``సినిమాలో హీరో బాగా డబ్బున్నోడు. అత‌డికి ఒక బ‌ల‌మైన ఇంటి పేరు కావాల‌నిపించింది. ఘ‌ట్ట‌మ‌నేని అనే పేరున్న‌వాళ్లంతా బాగా సెటిల్ అయిన‌వాళ్లే కాబ‌ట్టి ఆ పేరు పెట్టా`` అని చెప్పుకొచ్చాడు సంప‌త్ నంది.
Tags:    

Similar News