ర‌న్నింగ్ కారులో సంయుక్తా మీన‌న్ దూకుడు!

Update: 2022-02-11 04:37 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్..టాలీవుడ్ హంక్ రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో `భీమ్లా నాయ‌క్`  తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప‌వ‌న్ కి జోడీగా నిత్యామీన‌న్..రానాకి జంట‌గా సంయుక్తా మీన‌న్ న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంది. ఇక `లాలాభీమ్లా` సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.

 ప‌వ‌న్  మాస్ ఇమేజ్ కి స‌రైన మాస్ సాంగ్  తోడ‌వ్వ‌డంతో సినిమాపై హైప్ ఒక్క‌సారిగా అలా పైకి లేచింది. ఈ పాట‌కి సంయుక్త మీన‌న్ కూడా ఫిదా అయిపోయింది. `లాలా భీమ్లా` పాట అంటే ఎంతో ఇష్ట‌మ‌న‌ని గ‌తంలోనే చెప్పింది.

తాజాగా ఆ పాట‌ని ఎంత‌గా ఓన్ చేసుకుందో  మ‌రోసారి బ‌య‌ట‌పెట్టింది. ఈసారి ఏకంగా ఆపాట‌కి ర‌న్నింగ్ కారులోనే లుచి స్టెప్పులేసంత ఉత్సాహాన్ని చూపించింది. కారులో ప్ర‌యాణిస్తుండ‌గా..తానే స్వ‌యంగా డ్రైవింగ్ చేసుకుంటూ  `లాలా భీమ్లా` సాంగ్ వింటూ మాస్ బీట్ కి త‌ల‌కాయ స్ట‌రింగ్ ముందుకు వెన‌క్కి తెప్పుతూ పాట‌లో మ‌మేక‌మైపోయింది. దానికి సంబంధించిన ఓ వీడియో  నెట్టింట  వైర‌ల్  గా మారింది. ఈ వీడియోకి ల‌క్ష‌కు పైగా వ్యూస్ రావ‌డం విశేషం. పాట‌తో పాటు..పాట‌ని అనుస‌రిస్తున్న సెల‌బ్రిటీలు ఈ పాట‌తో  మ‌రింత ఫేమ‌స్ అవుతోన్న స‌న్నివేశం క‌నిపిస్తోంది.

ప‌వ‌న్ అభిమానిలా పాట‌ని మ‌ల‌యాళం  హీరోయిన్ ఎంత‌గా ఇష్ట‌ప‌డుతుందో ఈ స‌న్నివేశం చెప్ప‌క‌నే చెప్పింది. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓ జాన‌ప‌ద క‌ళాకారుడి ట్యూన్ అధారంగా థ‌మ‌న్ ఈ పాట‌ని కంపోజ్ చేసారు.

పాట‌కి అద్భుత‌మైన రెస్పాన్స్ రావ‌డంతో పాటు థ‌మ‌న్ మ‌రోసారి ప‌వ‌న్ అభిమానుల్లో వెలిగిపోతున్నాడు. ఈ పాట‌కి డీజే వెర్ష‌న్ ఓ రేంజ్లో వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.  `లాలా భీమ్లా` పాట ని త్రివిక్ర‌మ్ ర‌చించారు. ఈ చిత్రానికి ఆయ‌నే మాట‌లు కూడా అందిస్తున్నారు.

మందు బాటిల్ చేతి సంచి ఏంటిది భీమ్లా?

చేతిలో మ‌ద్యం బాటిల్ లేనిదే భీమ్లా లేడా?  ఉన్నా లేన‌ట్టేనా?  పెగ్గేయ‌క‌పోతే తిక్క రేగుద్దా.. ఏమో! అన్నీ డౌట్లే అభిమానుల‌కు.. ఏదైతేనేం భీమ్లా నాయ‌క్ స్టైల్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆరెంజు రంగు చొక్కాయ్.. గ‌ళ్ల లుంగీ పంచె చేతిలో బాటిల్ తో అత‌డి రెక్లెస్ యాటిట్యూడ్ క‌నిపిస్తోంది. డిగ్నిటీని మించి అత‌డిలో మాసిజం క‌నిపిస్తోంది. గ‌బ్బ‌ర్ సింగ్ ని మించిన తిక్క క్యారెక్ట‌ర్ ని ఎలివేట్ చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.


Watch Here : https://www.youtube.com/shorts/mSBlWR6w5qc
Tags:    

Similar News