శాండల్ వుడ్ బాహుబలి రెడీ

Update: 2018-12-20 01:30 GMT
ఏ ముహూర్తం లో రాజమౌళి బాహుబలిని ప్రపంచానికి పరిచయం చేసాడో కాని ప్రతి భాషలోనూ దాన్ని బెంచ్ మార్క్ గా చేసుకుని ఎలాగైనా తలదన్నే సినిమాను తీయాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. విజయ్ పులి తో మొదలుకుని ఇటీవలే వచ్చిన తగ్స్ అఫ్ హిందుస్థాన్ దాకా అలా తీస్తే అన్నీ తేడా కొట్టినవే. మలయాళం లో అయితే ఏకంగా వెయ్యి కోట్ల తో మహాభారతం తీసేందుకు శెట్టి అనే వ్యాపారవేత్త సిద్ధపడి తర్వాత డ్రాప్ అయ్యారు. ఇక కన్నడ లో మాత్రం అలాంటి విజువల్ గ్రాండియర్ ఒకటి రెడీ అవుతోంది.

కురుక్షేత్ర పేరు తో రూపొందిన ఈ మూవీ శాండల్ వుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ మూవీగా పేరొందింది. కెజిఎఫ్ కు మించిన బడ్జెట్ మూడింతలు దీనికి ఖర్చు చేసారని అక్కడి టాక్. స్టార్ హీరో దర్శన్ లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ మల్టీ స్టారర్. సీనియర్ హీరోలు యాక్షన్ కింగ్ అర్జున్ లవర్ మ్యాన్ రవి చంద్రన్ ఇటీవలే చనిపోయిన అంబరీష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీనికున్న మరో విశేషం ఏంటంటే ఇది పూర్తిగా త్రిడి లో రూపొందించారు. రజనీకాంత్ 2.0 తర్వాత అలా రూపొందిన సౌత్ మూవీ ఇదే.ఇంతా చేస్తే ఇది మన దాన వీర శూర కర్ణ రీమేక్ అని వినికిడి. అందులో ఎన్టీఆర్ దుర్యోధనుడిగా చేసిన విశ్వరూపాన్ని స్ఫూర్తిగా తీసుకుని అచ్చం అదే తరహాలో దర్శన్ ని ప్రెజెంట్ చేసినట్టు చెబుతున్నారు. కృష్ణ తీసిన కురుక్షేత్రం ఛాయలు కూడా ఇందులో ఉంటాయట.

మూడు గంటల పది నిమిషాల నిడివి వచ్చిన ఈ మూవీకి సెన్సార్ కూడా పూర్తయిపోయింది. తెలుగుతో సహా సౌత్ భాషలు అన్నింటిలో విడుదల కాబోతున్న ఈ మూవీని వచ్చే వేసవిలోనే తీసుకొస్తారట. పోటీ ప్లస్ ప్రమోషన్ కు ఎక్కువ సమయం కావాల్సిన నేపథ్యంలో  ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కురుక్షేతకు దర్శకుడు నాగన్న. మరో ట్విస్ట్ ఏంటంటే దీనికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. యుద్ధంలో చూపించిన వయొలెన్స్ దీనికి కారణమట
Tags:    

Similar News