క్యారెక్టర్ రోల్స్‌తో మొదలుపెట్టి.. హీరోగా ప్రమోషన్ అందుకుని.. సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు సందీప్ కిషన్. ఇప్పటిదాకా సాఫ్ట్ సినిమాలే చేసిన ఛోటా మేనల్లుడు తొలిసారి మాస్ హీరో అవతారమెత్తిన 'టైగర్' ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మంచి టైమింగ్ కోసమే ఇన్నాళ్లు ఎదురు చూశామని.. ఈ సినిమాతో తాను కెరీర్లో అతిపెద్ద కమర్షియల్ సక్సెస్ కొట్టడం ఖాయమని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు సందీప్.
ఈ సినిమాలో బీభత్సమైన ఫైట్లు చేశానని చెబుతున్న సందీప్.. అందుకోసం బాడీ కూడా భారీగానే పెంచాడట. ఓ సన్నివేశంలో తన ప్యాక్స్ కూడా చూపించానని.. ఐతే ఎడిటింగ్‌లో ఆ సన్నివేశాల్ని లేపేశారని చెబుతూ.. ట్విట్టర్లో ఆ పిక్స్ కూడా పెట్టాడు సందీప్. అవి చూస్తే కుర్రాడు బాగానే కష్టపడ్డం విషయం తెలుస్తోంది. మరి అంత కష్టపడి కూడా ఆ సన్నివేశాల్ని ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారన్నదే అర్థం కావడం లేదు. ఈ మధ్య 'రఫ్' సినిమా కోసం ఆది కూడా ఇలాగే ప్యాక్‌లు పెంచారు. ట్రైలర్లలో దాని గురించి బాగా హైలైట్ చేశారు. కానీ సినిమాలో విషయం లేకపోవడంతో ఆది సిక్స్‌ప్యాక్ గురించి సెటైర్లు బాగా పడ్డాయ్. సందీప్‌కు కూడా పెద్దగా మాస్ ఇమేజ్ ఏమీ లేదు. ఇప్పటికే ట్రైలర్లో చెప్పిన మాస్ డైలాగుల గురించి అదోలా మాట్లాడుకుంటున్నారు. ఇక ప్యాక్‌లూ అవీ చూపిస్తే అనవసరంగా సెటైర్లు పడతాయని వాటిని ఎడిటింగ్‌లో తీసేసినట్లున్నారు. మురుగదాస్ శిష్యుడు ఆనంద్ దర్శకత్వం వహించిన 'టైగర్'లో రాహుల్ రవీంద్రన్, సీరత్‌కపూర్ ముఖ్యపాత్రలు పోషించారు.