సందీప్ కిషన్ హీరోగా ఇప్పటికి ఆరేడు సినిమాలు చేసేశాడు కానీ.. చెప్పుకోవడానికి 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' మినహా కమర్షియల్ సక్సెస్ లేదు. ఎప్పుడు మాట్లాడినా ఆ ఒక్క సినిమా గురించే చెప్పుకోవాల్సిన పరిస్థితి. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' తర్వాత రారా కృష్ణయ్యా, జోరు, బీరువా సినిమాలు మంచి అంచనాల మధ్య విడుదలయ్యాయి కానీ.. ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. బీరువా పెట్టుబడి అయితే రాబట్టింది కానీ.. సక్సెస్ అనిపించుకోలేకపోయింది. మంచి అంచనాలతో వచ్చిన ఆ సినిమాలన్నీ సందీప్‌కు నిరాశ మిగల్చగా.. పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన 'టైగర్' మాత్రం అదరగొడుతోంది.
అనుకోకుండా పెద్దగా సినిమాలేవీ లేని టైమింగ్‌లో విడుదలవడం, సినిమాకు హిట్ టాక్ రావడంతో 'టైగర్' బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే గర్జిస్తోంది. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా రూ.5.7 కోట్లు వసూలు చేయడం విశేషం. సందీప్ స్థాయికి ఇది చాలా పెద్ద ఫిగర్. ఒకప్పుడు సందీప్ హీరోగా సినిమా తీయడానికి రూ.75 లక్షల బడ్జెట్ పెట్టే నిర్మాత కోసం తెగ తిరిగామని.. కానీ ఇప్పుడు అతడీ స్థాయిని అందుకోవడం చాలా ఆనందంగా ఉందని అతడి ఇండస్ట్రీ ఫ్రెండు ఒకరు ట్విట్టర్లో మహదానందం వ్యక్తం చేస్తుంటే సందీప్ కూడా తన ఆనందాన్ని పంచుకున్నాడు. టైగర్‌కు రూ.6 కోట్ల దాకా పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. అది సందీప్ స్థాయికి ఎక్కువే అనుకున్నారు. ఐతే ఇప్పుడా మొత్తాన్ని తొలి వారాంతంలోనే కలెక్ట్ చేసిందా సినిమా. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ అప్పట్లో రూ.12 కోట్ల దాకా వసూలు చేసి సందీప్ కెరీర్లో బెస్ట్‌గా నిలిచింది. జులై 10న బాహుబలి వచ్చేవరకు 'టైగర్' జోరు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి సందీప్ కెరీర్లో ఇదే బెస్ట్‌గా నిలవడం ఖాయం.