అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ తాజాగా మరో దర్శకుడు దేవా కట్టాతో కలిసి స్మిత హోస్టింగ్ చేస్తున్న 'నిజం' టాక్ షో లో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఇద్దరు దర్శకులు కూడా పలు విషయాలపై చర్చించారు. కెరీర్ లో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి షో లో ఇద్దరు మాట్లాడారు.
చిన్నప్పటి నుండి కూడా చిరంజీవి అభిమానిగా కొనసాగుతూ వస్తున్నానంటూ సందీప్ వంగ పేర్కొన్నారు. చిన్నతనంలో బంధువుల ఇళ్లకు వెళ్లిన సమయంలో నేను చేసే పనులు చూసి భయపడి మా అమ్మకు చెబుతామంటూ బెదిరించే వారు. అప్పుడు నేను ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి మంటల్లో దూకుతాడు.. అప్పుడు ఆయనకు ఏం కాలేదు కనుక నాకు ఏం కాదనేవాడిని.
మొదట్లో కెమెరా మెన్ అవ్వాలనుకున్నాను. కానీ తర్వాత తర్వాత దర్శకత్వంపై ఆసక్తి పెరిగింది. దర్శకత్వం లో మెలుకువల కోసం ప్రత్యేక శిక్షణ కూడా సందీప్ వంగ తీసుకున్నారు.
ప్రస్తుతం ఈయన బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేస్తున్నాడు. అది మాత్రమే కాకుండా ప్రభాస్ మరియు అల్లు అర్జున్ తో సినిమాలు ప్రకటించాడు.
ఇక మరో దర్శకుడు దేవా కట్టా తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. నేను చెన్నై లో పుట్టి పెరిగాను. మణిరత్నం.. బాల చందర్.. భారతిరాజా సినిమాలు చూస్తూ పెరిగాను. నాగార్జున గారి శివ సినిమా చూసి ఇన్సిఫైర్ అయ్యాను. అలా సినిమాల వైపు అడుగులు వేశాను. చెడి పోతున్న సమాజాన్ని బాగు చేయాల్సిన బాధ్యత సినిమాలపై ఉందనే చర్చ ను ఓవర్ రేటెడ్ చర్చగా దేవా కట్టా అభివర్ణించాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.