ఆ క్రిటిక్స్ ప్యారసైట్స్: సందీప్ వంగా

Update: 2019-07-06 09:39 GMT
సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'కబీర్ సింగ్' సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.  రూ. 200 కోట్ల మార్కును దాటిన తర్వాత కూడా ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు కొనసాగిస్తోంది. అయితే ఈ సినిమాను మెజారిటీ బాలీవుడ్ క్రిటిక్స్ దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై దర్శకుడు సందీప్ వంగా స్పందించాడు. రీసెంట్  గా సందీప్ ఫిలిం కంపానియన్ అనుపమ చోప్రాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.  ఈ ఇంటర్వ్యూలో విమర్శకులను ఓ రేంజ్ లో తగులుకున్నాడు.

సినిమా విజయాన్ని ఊహించారా? అని అడిగితే .. "అవును.. బాక్స్ ఆఫీస్ సక్సెస్ ను ఊహించాము. కానీ ఈ రేంజ్ లో జనాలకు కనెక్ట్ అవుతుందని.. ఈ మ్యాడ్ నెస్ మేము ఎక్స్ పెక్ట్ చేయలేదు.  మరో సారి కల్ట్ ఫిలిం అవుతుందని అనుకోలేదు" అన్నాడు.  ఇక విమర్శల గురించి అడిగితే "అవును 'అర్జున్ రెడ్డి' కి కూడా విమర్శలు వచ్చాయి. కానీ 'కబీర్ సింగ్' పై  విమర్శలు మరీ పిచ్చిగా ఉన్నాయి" అన్నాడు.

అవి ఆరోగ్యకరమైన విమర్శలు కావని.. సూడో క్రిటిసిజం అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అసలు ఆ విమర్శకులకు లవ్ అంటే ఏంటో తెలీదని అన్నాడు. "మీరు లవ్ లో ఉన్నప్పుడు అమ్మాయిని/అబ్బాయిని టచ్ చేయలేని.. చెంపదెబ్బ కొట్టలేని పక్షంలో అది ట్రూ లవ్ ఎలా అవుతుంది.. బహుశా వారు లవ్ ను సరైన పద్ధతిలో చూడలేదేమో. వాళ్ళు ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసే సమయంలో ఇది తప్పా.. ఇది ఒప్పా అని ఆలోచిస్తూ ఉన్నారేమో" అన్నాడు.

ఈ సినిమాలో 24 క్రాఫ్ట్స్ ఉంటే ఒక్క దర్శకుడి మీదే దృష్టి పెట్టారు.  వారేం క్రిటిక్స్ అన్నాడు.  ఈ సినిమాను తీవ్రంగా విమర్శించిన వారు ఒక్కరు కూడా ఈ సినిమాలో సౌండ్ డిజైన్ ఎలా ఉంది.. ఈ సినిమాలో ఫోటోగ్రఫీ ఎలా ఉంది.. కలర్ థీమ్ ఎలా ఉంది.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది అనే అంశాలపై మాట్లాడలేదు.  అవి ఎలా ఉన్నాయి అనే సంగతి చెప్పాలి కదా? అని విమర్శించాడు.  ఇలాంటి క్రిటిక్స్ వల్ల సినిమా ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందని.. ఒక్క ముక్కలో చెప్పాలంటే వీళ్ళు పారసైట్స్ అని తేల్చేశాడు.

రాజీవ్ మసంద్ ఈ సినిమాకు 2 రేటింగ్ ఇచ్చాడని... అదే 'సంజు' సినిమాకు 3.5 రేటింగ్ ఇచ్చాడని.. ఆ సినిమాలో 'సంజూ.. వేర్ ఈజ్ మై మంగళ్ సూత్ర' సంగతి ఏంటని..  ఆ సీన్ గురించి గంటల తరబడి మాట్లాడవచ్చు.  కానీ అందరికీ నచ్చింది.  ఇక ఆ సినిమాలో  హీరో మూడు వందల మందితో పడుకున్నానని చెప్పాడు.. అది కూడా తెగ నచ్చింది. అదంతా క్రిటిక్స్ కు ఓకేనా అని ప్రశ్నించాడు.  ఈ క్రిటిక్స్ మా పనిని  మెరుగయ్యేలా విమర్శించాలి.  అంతే కానీ గుడ్డెద్దు చేలో పడ్డట్టు వారి పైత్యాన్ని ప్రేక్షకులపై రుద్దకూడదు. సినిమాకు నష్టం కలిగించకూడదు అన్నాడు.  

ఈ సినిమా విజయం సంధించడం పట్ల విమర్శకులు సంతోషంగా లేరని అన్నారు. ఈ సినిమా రేప్ కల్చర్ ను ప్రోత్సహిస్తుంది అనే  విమర్శలపై మాట్లాడుతూ "నేను ఒక క్వాలిఫైడ్ డాక్టర్.  రేప్ విక్టిమ్స్ కు నేను ట్రీట్ మెంట్ ఇచ్చాను.  వారి ఎమోషన్స్.. బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఊరికే 'రేప్' అంటున్న ఈ విమర్శకులకు అసలు 'రేప్ అనే పదానికి అర్థం తెలియదు.  ఏదో ఒక పదం ఉంది కదా అని జస్ట్ వాడుతున్నారు" అన్నాడు.

    
    
    

Tags:    

Similar News