#సందీప్ వంగా... మెగాస్టార్ ని ర‌గ్గ్ డ్ గా చూపిస్తారా?

Update: 2021-04-27 04:32 GMT
మెగాస్టార్ చిరంజీవిని సునిశితంగా ప‌రిశీలించేవాళ్లు ఆయ‌న‌లోని సెన్సిబిలిటీస్ గురించి గొప్ప‌గా వ‌ర్ణిస్తారు. ఆయ‌న ఫ్యామిలీ మ్యాన్. కుటుంబాన్ని ఏక‌తాటిపైకి తెచ్చి నిల‌బెట్టే ప్ర‌య‌త్నం లో కానీ.. ప‌రిశ్ర‌మ‌లో స్నేహాలు స‌త్సంబంధాల‌ను కొన‌సాగించ‌డంలో కానీ ఆయ‌న ప్ర‌త్యేక‌త వేరు. ఎంతో సున్నిత ఉద్వేగాల‌ను క‌లిగి ఉన్న గొప్ప మూర్తీభ‌వించిన వ్య‌క్తిత్వం. బ్లడ్ బ్యాంక్ స‌హా ఎన్నో సేవాకార్య‌క్ర‌మాల‌తో నిరంత‌రం ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై ఉన్నారు. రాజ‌కీయాల్లోకి వెళ్లినా కానీ అక్క‌డ అసంబ‌ద్ధ‌మైన ప‌రిస్థితుల్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోవ‌డానికి కార‌ణం ఆయ‌న‌లోని సెన్సిబిలిటీస్ అని చెబుతారు.  రాజ‌కీయాల‌కు కావాల్సిన‌ క్రూరత్వ పోక‌డ అణ‌చివేత ధోర‌ణి ఆయ‌న‌లో లేదు.!!

అయితే అలాంటి వ్య‌క్తిత్వాన్ని తెర‌పైనా అంతే మంచిగా ప్ర‌జ‌లు ఆశిస్తారు. అలాగే చిరు నుంచి వినోదం అంటే.. చ‌క్క‌ని హాస్యం ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో కూడుకున్న‌ది. చిరును అలాంటి ఇమేజ్ ధృక్కోణంలో మాత్ర‌మే చూడ‌గ‌ల‌రు. కానీ  అర్జున్ రెడ్డి లాంటి రా అండ్ ర‌స్టిక్ సినిమాని తీసిన సందీప్ రెడ్డి వంగా సెన్సిబిలిటీస్ కి చిరు క‌నెక్ట‌వుతారా?  మెగాస్టార్ ని ఆయ‌న ఒక క్రూరుడిగా చూపిస్తే అభిమానుల‌కు న‌చ్చుతుందా? అన్న డిస్క‌ష‌న్ ఇటీవ‌ల వేడెక్కిస్తోంది.

ఆచార్య త‌ర్వాత లూసీఫ‌ర్.. వేదాళం వంటి రీమేక్ సినిమాల్లో న‌టిస్తున్న చిరుకు అవ‌న్నీ యాప్ట్ స‌బ్జెక్ట్స్. కానీ వాట‌న్నిటి కంటే భిన్న‌మైన క‌థ‌లో సందీప్ రెడ్డి వంగా చిరును చూపించాల్సి ఉంటుంది. అయితే సందీప్ రెడ్డి వంగా ర‌స్టిక్ క్యారెక్ట‌రైజేష‌న్ చిరుకు స‌రిపోతుందా? అన్న‌ది సందిగ్ధ‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ర‌ణ‌బీర్ క‌థానాయ‌కుడిగా అత‌డు తెర‌కెక్కిస్తున్న `యానిమ‌ల్` కూడా రా అండ్ ర‌స్టిక్ అని క‌థ‌నాలొచ్చాయి. అందుకు భిన్న‌మైన నేప‌థ్యంతో స్క్రిప్టును చిరు కోసం ఆయ‌న సిద్ధం చేశారా? అన్న‌ది చూడాల్సి ఉంది.

అయినా విలక్ష‌ణ‌ ద‌ర్శ‌కుడు అంటే ఎప్పుడూ ఒకే త‌ర‌హా సినిమాల్ని తీసేవారు అని అర్థం కాదు. వారు ఒకే జోన‌ర్ కాకుండా ఎలాంటి స‌బ్జెక్టుల‌తో అయినా మెప్పించాలి. అప్పుడే ఆ వైవిధ్యం జ‌నాల‌కు అర్థ‌మ‌వుతుంది.
Tags:    

Similar News