ఆ స్టార్‌ నిర్మాత కామాంధుడు.. ఒంటరిగా రమ్మన్నాడు

Update: 2023-05-24 17:00 GMT
సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది సుదీర్ఘ కాలంగా కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో మీటూ అంటో సోషల్ మీడియాలో బాధితులు పోస్ట్‌ లు పెడుతున్న కారణంగా కాస్టింగ్‌ కౌచ్ అనేది కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. చాలా మంది హీరోయిన్స్ మరియు నటీమనులు తాము కెరీర్‌ ఆరంభంలో ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ విషయాలను బయట పెట్టారు.. ఇంకా కొందరు బయట పెడుతూనే ఉన్నారు.

తాజాగా బాలీవుడ్‌ నటి 'శుభ్‌ మంగళ్‌ మే దంగల్‌' అనే సినిమాలో నటించి మంచి గుర్తింపును దక్కించుకున్న సంగీతా ఒడ్వాని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను కెరీర్‌ ఆరంభంలో ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ చెడు అనుభవాన్ని గురించి చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో నేను అందరితో చనువుగా ఉండేదాన్ని. ఆ సమయంలో తెలిసి తెలియక దూరంగా ఉండాల్సిన వారితో కూడా చనువుగా ఉండేదాన్ని.

దాంతో ఒకసారి ప్రముఖ నిర్మాతగా పేరున్న వ్యక్తి ఒంటరిగా సినిమా గురించి చర్చించాలి అంటూ రమ్మన్నాడు. పదే పదే ఒంటరిగా రమ్మనడంతో అనుమానం వచ్చింది.

నిర్మాత రమ్మన్న చోటుకు ఒంటరిగా కాకుండా స్నేహితురాలితో కలిసి వెళ్లాను. ఒంటరిగా రమ్మంటే నేను స్నేహితురాలితో వెళ్లడంతో ఆయనకు కోపం వచ్చింది. నాతో ఏమీ మాట్లాడుకుండానే అర్జంట్ పని ఉందంటూ వెళ్లి పోయాడు.

అప్పుడే నాకు అతడి ఉద్దేశం ఏంటో అర్థం అయ్యింది. ఆ తర్వాత కూడా అతడు నన్ను ఒంటరిగా కలిసేందుకు ప్రయత్నించాడు కానీ నేను ఒప్పుకోలేదు అంటూ సంగీతా ఒడ్వాని పేర్కొంది. ఆ నిర్మాత ఎవరు అనే విషయంలో మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు.

Similar News