ఫొటోటాక్‌ : సంగీత ఫ్యామిలీని చూశారా

Update: 2020-11-10 00:30 GMT
తెలుగు.. తమిళం.. కన్నడం మరియు మలయాళం ఇలా అన్ని సౌత్‌ భాషల్లో నటించిన ముద్దుగుమ్మ సంగీత. హీరోయిన్‌ గా చాలా సినిమాల్లో నటించిన ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్‌ ను ప్రారంభించి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తున్న సంగీత పెళ్లి అయ్యి చాలా ఏళ్లు అయ్యింది. ఆ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. సంగీత ఫ్యామిలీ ఫొటోలు చాలా తక్కువగా సోషల్‌ మీడియాలో ఉంటాయి. ఇటీవల సంగీత తన కూతురు మరియు భర్తతో ఉన్న ఫొటోను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది. సంగీత ఫ్యామిలీ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

దాదాపుగా పదేళ్ల తర్వాత టాలీవుడ్‌ లో ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇన్నాళ్లు తమిళ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూ వచ్చిన ఈ తమిళ ఆంటీ ఇప్పుడు తెలుగులో కూడా వెండి తెర బుల్లి తెర అనే తేడా లేకుండా వరుసగా ఏదో ఒక రకంగా ఎంటర్‌ టైన్‌ చేసేందుకు సిద్దంగా ఉంది. ఈమద్య ఈటీవీలో ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఈమె సినిమాల్లో ఆఫర్ల కోసం కూడా వెయిట్‌ చేస్తున్నట్లుగా చెప్పింది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మాదిరిగా హీరోయిన్‌ తల్లి పాత్ర లేదా హీరో తల్లి పాత్రలో అయినా నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా సంగీత అంటోంది. మళ్లీ ఈమె టాలీవుడ్‌ లో బిజీ అయ్యేనా చూడాలి.
Tags:    

Similar News