వాస్తవ పరిస్థితులకు సందేశం - కామెడీ జతకలిపి ప్రేక్షకులను ఎంతో మెప్పించాయి మున్నాభాయ్ సిరీస్ సినిమాలు. హీరో సంజయ్ దత్ - డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని కాంబినేషన్ లో ఇప్పటివరకు మున్నభాయ్ ఎం.బి.బి.ఎస్. - లగేరహో మున్నాభాయ్ సినిమాలు వచ్చాయి. ఈ రెండూ సినిమాలు ప్రేక్షకాభిమానంతో పాటు కలెక్షన్లు కొల్లగొట్టాయి. మున్నభాయ్ ఎం.బి.బి.ఎస్. వైద్య వృత్తిలో లోపాలను సునిశితంగా ఎత్తిచూపిస్తే.. లగేరహో మున్నాభాయ్ గాంధీజిని మనం ఎలా అర్ధం చేసుకోవాలో అందరికీ అర్ధమయ్యేలా చూపింది.
మున్నాభాయ్ సిరీస్ పట్ల ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని మూడో పార్ట్ తీయాలనే ఆలోచనలో డైరెక్టర్ అండ్ హీరో ఉన్నారు. వీళ్లిద్దరి ఫేవరెట్ సినిమాగా లగేరహో మున్నభాయ్ సినిమానే చెబుతుంటారు. దీంతో మూడో పార్ట్ కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టారు. డైరెక్టర్ టీం ఈ పని కొలిక్కి తేగానే అఫీషియల్ స్టేట్ మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. సంజయ్ దత్ - రాజ్ కుమార్ హిరాని ప్రస్తుతం వేర్వేరు సినిమా కమిట్ మెంట్లతో బిజీగా ఉన్నారు. వాళ్లిద్దరు చేతిలో ఉన్న ప్రాజెక్టులు ముగించుకున్నాక ఈ సినిమా కోసం పూర్తి సమయం కేటాయించనున్నారు.
మున్నాభాయ్ సినిమాలు రెండింటినీ శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. - శంకర్ దాదా జిందాబాద్ పేరుతో చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేశారు. ఈ రెండు సినిమాలు మెగా అబిమానులను బ్రహ్మాండంగా ఆకట్టుకున్నాయి. మున్నాభాయ్-3 సినిమా హిందీలో హిట్ కొడితే అది తెలుగులో చిరంజీవి రీమేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. ఆ రకంగా శంకర్ దాదాను మరోసారి వెండితెరపై చూసే ఛాన్సు అభిమానులకు లభిస్తుందన్న మాట.