బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో సంచలనాల కథానాయికగా పాపులరైంది ఆలియాభట్. ఓవైపు ప్రియుడు రణబీర్ సరసన బ్రహ్మాస్త్ర లాంటి భారీ మల్టీస్టారర్ లో నటిస్తూనే మరోవైపు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తో బిజీ అయ్యింది. ఇంతలోనే కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో గంగూభాయి కతియావాడీ అంటూ మరో సెన్సేషన్ కి సిద్ధమైంది. కానీ అన్నిటినీ కోవిడ్ వెంటాడుతోంది.
ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ లకు రావాల్సి ఉన్నా ఆలస్యమవుతోంది. సెకండ్ వేవ్ వల్ల వీటి చిత్రీకరణలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇటీవల ముంబై మహారాష్ట్రలో కోవిడ్ శాంతిస్తోంది. అందువల్ల తిరిగి షూటింగులకు అనువైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూన్ 15 నుండి కొత్త రూల్స్ ని అనుసరిస్తూ తిరిగి గంగూబాయి కతియావాడీ షూటింగ్ ప్రారంభిస్తున్నారు.
కొత్త అన్‌లాక్ మార్గదర్శకాలతో మహారాష్ట్ర లో చిత్రీకరణలు తిరిగి ప్రారంభమైనందున సంజయ్ లీలా భన్సాలీ తాజా షెడ్యూల్ ని వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. చరిత్ర పుటలలో నిలిచిన వేశ్యా గృహం కామాటిపుర నిర్వాహకురాలి పాత్రలో ఆలియా ఈ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాలో భారీ సెట్స్ లో నృత్యాల్ని చిత్రీకరించాల్సి ఉంది. అయితే భారీ కాస్టింగ్ తో పాటల చిత్రీకరణ లేదా క్రౌడ్ సన్నివేశాల షూటింగ్ ప్రస్తుతానికి నిషేధమని తెలిసింది. గంగూబాయి కతియావాడితో పాటు జూన్ 15 నుండి అనేక ఇతర చిత్రాలు కూడా వాటి సన్నివేశాల చిత్రీకరణతో తిరిగి ప్రారంభమవుతాయి.
కోవిడ్ -19 రెండవ వేవ్ కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన తరువాత షూటింగులు ఆగిపోయాయి. ఏప్రిల్ మధ్యలో లాక్ డౌన్ ప్రకటించాక నెలపైగానే షూటింగులు నిలిచిపోయాయి. గంగూబాయి కతియావాడి షూటింగ్ కూడా ఆ తర్వాత ఆగిపోయింది. ముంబై - మహారాష్ట్రలలో తాజా కోవిడ్ కేసుల సంఖ్య తగ్గడం టీకాలు వేగవంతం అవ్వడంతో ప్రొడక్షన్ హౌస్ లకు తిరిగి షూటింగులు చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతించింది.
ఇక హైదరాబాద్ లోనూ లాక్ డౌన్ ని నెమ్మదిగా సడలిస్తున్నారు. తెలుగు సినిమా షూటింగులపై ప్రభుత్వాల నుంచి అభ్యంతరాలేవీ లేవు. కానీ స్వచ్ఛంతంగా ఇన్నాళ్లు విరమించారు. ఇకపై తిరిగి చిత్రీకరణలు ప్రారంభించే యోచన చేస్తున్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ తదుపరి షెడ్యూల్ పై జక్కన్న టీమ్ క్లారిటీనిస్తుందేమో చూడాలి. ఈనెల 15 నుంచి ఆలియా గంగూభాయి చిత్రీకరణలో బిజీ అవుతుంది కాబట్టి జక్కన్న పిలుపు మేరకు కాల్షీట్లను కేటాయిస్తుందేమో చూడాలి. చరణ్ - ఆలియా సహా కీలక తారాగణంపై ఆర్.ఆర్.ఆర్ సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉందని తెలిసింది.