కరోనా, ఒమిక్రాన్ ల వల్ల 50 శాతం ఆక్యుపెన్సీ, కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ వంటి కారణాలతో సంక్రాంతికి బరటిలోకి దిగాలనుకున్న పాన్ ఇండియా చిత్రాలు. స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సంక్రాంతికి `రాధేశ్యామ్` తో ప్రాభాస్, ట్రిపుల్ ఆర్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్, సర్కారు వారి పాట తో సూపర్ స్టార్ మహేష్ బరిలో తలపడాలనుకున్నారు. కానీ కరోనా, ఒమిక్రాన్ ల వల్ల, 50 శాతం ఆక్యుపెన్సీల కారణంగా, కొన్ని చిత్రాల షూటింగ్ లు పూర్తి కాకపోవడంతో సంక్రాంతి బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
భారీ చిత్రాలన్నీ అనూహ్యంగా సైడైపోవడంతో సోలోగా `బంగార్రాజు` చిత్రంతో నాగార్జున, నాగచైతన్య బరిలోకి దిగారు. తండ్రీ కొడుకులు కలిసి నటించిన చిత్రం కావడం.. `సోగ్గాడే చిన్నినాయన` సీక్వెల్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే టాక్ బాగానే వున్నా సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టలేకపోయింది. సంక్రాంతికి భారీ చిత్రాల పోటీ లేకపోయినా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని మాత్రం రాబట్ట లేకపోయింది.
దీంతో ఎంతో ఆశగా భారీ చిత్రాల మధ్య సరవత్తర పోటీ వుంటుందని ఎదురుచూసిన సగటు ప్రేక్షకుడికి ఈ సంక్రాంతి తీవ్ర నిరాశనే మిగిల్చింది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి సమరం మాత్రం భారీగానే వుండబోతోందని తెలుస్తోంది. 2023 సంక్రాంతి సమరానికి చాలా మంది హీరోలు కర్చీఫ్ లు రెడీ చేసుకుంటున్నా ముందు బెర్త్ లని కన్ఫర్మ్ చేసుకున్నారు ఇద్దరు క్రేజీ స్టార్లు. దీంతో 2023 సంక్రాంతి సమరం రసవత్తరంగా సాగనున్నట్టుగా తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే... ఈ ఏడాది `రాధేశ్యామ్` చిత్రంతో భారీ ఫ్లాప్ ని సొంతం చేసుకుని తీవ్ర అసంతృప్తితో వున్న పాన్ ఇండియా స్టార్ వచ్చే ఏడాది `ఆది పురుష్`తో రచ్చ చేయడానికి రెడీ అయిపోతున్నారు. బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ఓమ్ రౌత్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ మూవీని టి సిరీస్ ఫిల్మ్స్ , రెట్రో ఫైల్స్ సంస్థలపై భూషణ్ కుమార్ , కృష్ణకుమార్, ఓం రౌత్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. క్రితి సనన్ సీతగా ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన కార్యక్రమాలు జరుపుకుంటోంది.
2డీ తో పాటు ఈ మూవీని త్రీడీ ఫార్మాట్ లోనే అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి బరిలో పోటీకి రెడీ అవుతున్న చిత్రాల్లో ముందుగా డేట్ ప్రకటించి `ఆది పురుష్` టీమ్ వార్ ప్రకటించింది. రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పడు ఈ మూవీతో సంక్రాంతి వార్ కి మరో స్టార్ సినిమా రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం `హరి హర వీరమల్లు`. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం. రత్నంతో పాటు ఏ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు.
పవన్ నటిస్తున్న తొలి జానపద చిత్రం ఇదే కావడం విశేషం. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ 17వ శతాబ్దం నేపథ్యంలో ఔరంగ జేబు కాలం నాటి కథతో తెరకెక్కుతోంది. చాలా ప్రత్యేకతలతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా బందిపోటు దొంగగా కనిపించబోతున్నారు. కోహినూర్ వజ్రం చుట్టూ సాగే కథ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని ముందు దసరాకు విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడం, వీఎప్ ఎక్స్ వర్క్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీని సంక్రాంతికి బరిలో దింపాలని నిర్ణయించుకున్నారట.
త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా మేకర్స్ వెల్లడించనున్నారని తెలిసింది. బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ రోషనారగా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో అర్జున్ రాంపాల్ ఔరంగ జేబుగా, ఆదిత్య మీనన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ.ఎం. రత్నం. ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు.