స్టార్ కమెడియన్ హోదాను అందుకున్న చాలామంది నటులు కొన్నేళ్ల వరకు ఆ హోదాలో వెలుగుతుంటారు. చాలా ఏళ్ల తర్వాత ఓ మంచి కథ వస్తే గాని హీరోగా అడుగులు వేయడానికి ప్రయత్నించరు. కానీ అలా స్టార్ కమెడియన్ గా ఎదుగుతోన్న సమయంలోనే హీరోగా అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నాడు సప్తగిరి. వీలైనంత వరకు కొంచెం బారి స్థాయిలో ప్రమోషన్స్ కూడా చేసుకుంటున్నాడు.
మొదట సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాతో అపజయాన్ని అందుకున్నా కథానాయకుడిగా పాస్ మార్కులను అందుకున్నాడు. అయితే మళ్లీ నిరాశ చెందకుండా మరో సినిమాతో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతోన్నడు. చరణ్ లక్కాకుల దర్శకత్వంలో సప్తగిరి LLB ట్రైలర్ రీసెంట్ గా రామ్ చరణ్ చేతుల మీదిగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్ విషయానికి వస్తే.. సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే LLB కాన్సెప్ట్ చుట్టే కథ తీరుగుతోందని తెలుస్తోంది. కోర్టులో వచ్చే కామెడీ సీన్స్ కాస్త సిల్లీగా ఉన్నా సినిమా కంటెంట్ ని బట్టి కమర్షియల్ గా నడిపిస్తే ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు.
సినిమాటోగ్రఫీ చాలా బావుంది. స్టార్ హీరోస్ లెవెల్ సినిమా మూమెంట్ కనిపిస్తోంది. సప్తగిరి సినిమాలో పాటలకు స్టెప్పులు కొత్తగా వేసినట్లు అనిపిస్తోంది. మరి ప్రేక్షకులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. ఇక యాక్షన్ సీన్స్ కొంచెం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనేలా ఉంది. ఇక డైలాగులు కూడా సినిమా లెవెల్ ని కొంచెం పెంచేలా ఉన్నాయి. కాకపోతే సప్తగిరి ఇమేజ్ కు అవి భారీగా ఓవర్ అనే చెప్పాలి.
చూస్తుంటే దర్శకుడు ఈ సినిమాను కమర్షియల్ హంగులతో సినిమాను తెరకెక్కించాడు అనిపిస్తోంది. కాని ఇలా సరైన ఇమేజ్ లేని హీరోను కాస్త ఓవర్ గా చూపిస్తే.. అది అటూ ఇటూ కొందరికి నచ్చొచ్చు కాని బాక్సాఫీస్ దగ్గర అటూ ఇటూ అయ్యే ఛాన్సు కూడా ఉంది. మరి రిలీజ్ అయిన తర్వాత సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Full View