ఒక మతాన్ని ఫాలో అయ్యే వారు ఆ మతానికే పరిమితం కావాలా? ఒక మతం వారు ఇచ్చే ప్రసాదాన్ని అంటరానిదిగా చూస్తూ.. దాన్ని టచ్ చేయటం కూడా పాపమన్నట్లుగా చూసే వారిని ఏమనాలి? దేవుడికి నైవేద్యం పెట్టిన దాన్ని టచ్ చేయకూడదన్నట్లుగా వ్యవహరించటంలో ఉండే అర్థం ఏమిటో ఒక పట్టాన అర్థం కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటివి చాలానే కనిపిస్తాయి.
అయితే.. తాను ఫాలో అయ్యే మతానికి సంబంధం లేని దేవుడ్ని ఆరాధించి.. దండం పెట్టిన వైనం ఒక బాలీవుడ్ నటికి ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యేలా చేసింది. దేశ వ్యాప్తంగా సాగుతున్న గణేశ్ నవరాత్రుల ఉత్సవాల నేపథ్యంలో బాలీవుడ్ నటి సారా అలీఖాన్ కూడా అందులో పాలు పంచుకుంది. తాను పాల్గొన్న షూటింగ్ అనంతరం.. తనకు దగ్గర్లో ఉన్న గణనాథుడ్ని దర్శించుకొని వెళ్లిపోయారు. గణేశుడ్ని తాను దర్శించుకున్న వైనంపై ఒక ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
అంతే.. అదేదో చేయకూడని పాపం చేసినట్లుగా పలువురు ఆమెను తిట్టిపోయటం ఆశ్చర్యకరంగా మారింది. గణపతి బప్పా మోరియా.. మీకున్న అడ్డంకులు తొలగించి.. ఏడాదంతా పాజిటివ్ గా ఉంటూ.. నవ్వుతూ సంతోషంగా ఉండాలంటూ వినాయక చవితి గ్రీటింగ్స్ చెప్పిన ఆమె తీరును పలువురు తప్ప పట్టారు.
గణేశుడ్ని సందర్శించిన ఫోటోను పోస్ట్ చేసిన సారాను కొందరు నెటిజన్లు తిట్టి పోశారు. నువ్వు అసలు ముస్లింవేనా? పవిత్ర మొహర్రం మాసంలో ఇలాంటి పనులు చేస్తారా? ఇంతకీ నీ మతం ఏమిటో గుర్తుందా? లేదా? అంటూ ట్రోల్ చేయటం షురూ చేశారు. అర్థం లేని నెగిటివ్ కామెంట్లు పెట్టారు.
దీంతో.. సారా ఫ్యాన్స్ పలువురు రంగంలోకి దిగారు. భారత్ లౌకిక దేశమని.. ప్రతి ఒక్కరు తమకు నచ్చిన రీతిలో భగవంతుడ్ని కొలవొచ్చని.. వినాయకచవితితో పాటు ఈద్ కూడా గొప్పగా జరుపుకోవాలి సారా అంటూ ఆమెకు అండగా నిలిచారు. ఈ లెక్కన ఒక మతాన్ని ఫాలో అయ్యే వారు.. వారు అనుసరించిన మరో మతానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం తప్పా?
అయినా.. ఇలాంటి విపరీతమైన మనస్తత్వంతో పాటు ఇరుకు మైండ్ సెట్ ఉన్న వారిని చూస్తే.. డిజిటల్ యుగంలో ఎక్కడికి పోతున్నామన్న భావన కలగటం ఖాయం. సెలబ్రిటీలనే కాదు.. సామాన్యుల్ని సైతం ఇలా పరిమితులు పెట్టే వారి విషయంలో అందరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఈ వికారాలు తగ్గే వీలుంది.