సైఫ్ అలీ ఖాన్ - అమృతా సింగ్ ల కూతురు సారా అలీ ఖాన్ 2018 లో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమా 'కేదార్ నాథ్' రెండో సినిమా 'సింబా' బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించడంతో సారా ఫుల్ జోష్ మీద ఉంది. రీసెంట్ గా ఫిలిం ఫేర్ మ్యాగజైన్ పై మొదటిసారిగా దర్శనమిచ్చింది.
ఫిలింఫేర్ మ్యాగజైన్ కవర్ పేజిపై ఇలా మెరిసే అవకాశం రావడం నిజంగా గొప్పే కానీ ఆ ఫోటో మాత్రం నెటిజనుల ట్రోలింగ్ కు గురవుతోంది. ఈ ఫోటోలో ఒక కర్రను పట్టుకుని సారా అలా నిల్చుంటే అదే ఫోటోలో ఒక ఆఫ్రికా వ్యక్తి కూడా నిలబడి ఉన్నాడు. సారా కు నీడ ఉంది కానీ అతనికి నీడ లేదు. ఫోటోషాప్ సరిగా చేయకపోవడంతో అతను సారా వెనక ఉన్నాడా.. పక్కన ఉన్నడా.. లేదా గాల్లో అలా తేలుతున్నాడా అనేది జనాలకు అర్థం కాక జుట్టుపీక్కున్నారు. దీంతో చాలామంది "క్వాలిటీ లేని వారిని పెట్టుకుంటే ఫోటోషాప్ ఇలానే తగలడుతుందని" ఫిలిం ఫేర్ మ్యాగజైన్ ను తిట్టిపోస్తునారు. అంతే కాదు.. ఒక నల్ల జాతీయుడిని సెట్ ప్రాపర్టీలాగ వాడడం సభ్యత కాదని.. ఇంకా మనం ఏ కాలంలో ఉన్నామంటూ ఫిలిం ఫేర్ వారిని. సారాను ఘాటుగా విమర్శిస్తున్నారు.
మెజారిటీ జనాలు తిట్టిపోసినా ఒక నెటిజనుడు మాత్రం ఈ ఫోటో లో ఒక థీమ్ ట్రై చేసి ఉంటారని అంటున్నాడు. సారా ఒక మంత్రగత్తెలా కర్ర పట్టుకుని నిలుచుందని.. పక్కనే గాలిలో అఫ్రికా వ్యక్తి ఎగురుతూ ఉన్నాడని.. అతని కాళ్ళ నీడ సారా కాళ్ళ దగ్గర ఉండే డ్రెస్ మీద పడిందని అంటున్నాడు. ఏమో.. థీమ్ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా సరిగా ఎగ్జిక్యూట్ చేయకపోవడంతో తిట్టించుకోవాలసి వచ్చిందేమో. ఇవన్నీ పక్కన పెడితే సారా మాత్రం ఫోటోలో బ్యూటిఫుల్ గా ఉంది.