తరం మారుతున్నంతనే కొత్త ప్రేమలు తెర మీదకు వస్తుంటాయి. కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రేమకథ గురించి మీడియాలో పెద్ద ఎత్తున వచ్చేది. కరీనాతో అతగాడి ప్రేమాయాణం మీద టన్నుల కొద్ది న్యూస్ ప్రింట్ నింపేసింది. చివరకు వారిద్దరూ ఒకటి కావటంతో కథ కంచికి వెళ్లి పోయింది. ఇప్పుడు సైఫ్ మొదటి భార్య కుమార్తె సారా అలీఖాన్ టర్న్ వచ్చింది. ఇప్పుడామె బాలీవుడ్ కుర్ర హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ ప్రచారానికి బలం చేకూరేలా తాజాగా ఒక ఫోటోను సదరు నటుడు షోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇటీవల విడుదలైన పతి పత్ని ఔర్ వో పేరుతో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టిన బాలీవుడ్ యువ నటుడు కార్తిక్ ఆర్యన్ తో సైఫ్ కుమార్తె ఎంత డీప్ లవ్ లో ఉన్నారన్న విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాతో చెప్పేశారు. వీరిద్దరి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ నడుస్తుందన్న వాదనకు బలం చేకూరేలా ఇటీవల సారా ఒక ఇంటర్వ్యూ లో ఓపెన్ అయితే.. తాజాగా ఆమెతో తనకున్న దగ్గరితనాన్ని చెప్పే ఫోటోను కార్తీక్ పోస్టు చేసేశాడు.
తనకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందని.. తనది కూడా ఆ రకమైన ప్రేమగా అమ్మడు చెప్పేస్తే.. తాజాగా తన ఇన్ స్టా అకౌంట్లో సారాకు భోజనం తినిపిస్తున్న క్లోజ్ మూమెంట్ ఫోటోను పోస్టు చేశాడు కార్తిక్. ఫోటోను మాత్రమే పోస్టు చేస్తే ఒకలా ఉండేది. కానీ.. కింద కామెంట్ కూడా ఆసక్తికరంగా మారింది. నువ్వు బాగా సన్నగా అయిపోయావు. బాగి తిని మళ్లీ బరువు పెరగాలంటూ చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది.
నిజానికి వీరిద్దరి ప్రేమ బీజం పడింది.. వారిద్దరూ కలిసి నటించిన లవ్ ఆజ్ కల్ మూవీతోనేనని చెబుతారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి వేళ.. తమ మధ్యనున్న రిలేషన్ పై ఇద్దరూ ఓపెన్ అయ్యారా? అన్నట్లుగా వారి రియాక్షన్ ఉందన్న మాట వినిపిస్తోంది.మరి.. కుమార్తె ఘాటు ప్రేమకు సైఫ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.