సచిన్ కూతురు.. ఆమె బాయ్‌ ఫ్రెండ్ తో..

Update: 2017-04-11 09:24 GMT
గత కొంత కాలంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్ ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నమధ్యన ఆమె హీరో రణవీర్ సింగ్ తో కలసి దిగిన సెల్ఫీ ఒకటి బయటకొచ్చింది. ఆ దెబ్బతో సారా త్వరలోనే తెరంగేట్రం చేస్తోందంటూ న్యూసులు వచ్చేశాయి. కాని చివరకు సచిన్ వాటిని ఖండించాడు. తన కూతురు బాగా చదువుకుంటోందని.. తనకు యాక్టింగ్ చేసే ఉద్దేశ్యం కూడా లేదని సెలవిచ్చాడు. అయితే ఇప్పుడు సారా కొత్త ఫోటోలు మరోసారి సంచలన రేపుతున్నాయి.

నిన్న ''ముంబయ్ ఇండియన్స్'' టీమ్ ఐపిఎల్ లో పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఓనర్లైన అంబానీలు ఒక పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ కూడా వచ్చింది. అసలే బాలీవుడ్లో త్వరలో హీరోయిన్ గా తెరంగేట్రం చేయబోతోంది కాబట్టి.. జాన్వి వెనుకనే ఆమె ప్రియుడు శిఖర్ పహరియా కూడా తెగ తిరిగేస్తున్నాడు. కాని విశేషం ఏంటంటే.. జాన్వి అండ్ శిఖర్ కలసి ఒక్క ఫోటోకు కూడా ఫోజులివ్వలేదు కాని.. సచిన్ కూతురు సారా మాత్రం శిఖర్ తో కలసి పేజ్ 3 ఫోటోగ్రాఫర్లకు రకరకాలు ఫోజులిచ్చింది. మొత్తానికి జాన్వి బాయ్‌ ఫ్రెండ్ తో ఇలా సారా కనిపించడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది.

చూస్తుంటే 19 ఏళ్ళ సారా ఖచ్చితంగా సినిమాల్లోకి వస్తుందని.. అందుకే ఇలా హైప్ క్రియేట్ చేసుకుంటోందని.. వినిపిస్తున్న రూమర్లలో కొంచెం నిజం ఉందనే అనిపిస్తోంది కదూ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News