భర్తతో కలిసి ఆ ఫోటోను మొదటిసారి షేర్ చేసుకున్న పాక్ ప్రముఖ నటి

Update: 2021-06-22 11:30 GMT
దాయాది పాక్ కు చెందిన ప్రముఖ నటి సారాఖాన్ తన పర్సనల్ ఫోటోను షేర్ చేసింది. భర్తతో కలిసి తన బేబీ బంప్ కనిపించేలా ఫోటో దిగి.. సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో.. తాను తల్లిని కాబోతున్న విషయాన్ని అందరికి షేర్ చేశారు. దీంతో ఆమె అభిమానులు గుడ్ న్యూస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

పాకిస్థాన్ లోని ప్రముఖ నటీమణుల్లో సారా ఖాన్ ముందుంటారు. సౌదీలో పుట్టిన ఆమె పాక్ లో మంచి నటిగా గుర్తింపు పొందారు. 2012లో తొలిసారి టీవీ తెర మీద తళుక్కుమన్న ఆమె.. ఆ తర్వాత మూడేళ్లకు అల్విదా అనే మూవీలో నెగిటివ్ రోల్ తో పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. గత ఏడాది ఆమె ఫాలక్ షబ్బిర్ ను పెళ్లాడారు.

తాను ప్రెగ్నెంట్ అయిన ఫోటోను తొలిసారి పోస్టు చేసిన సందర్భంగా.. ఖురాన్ కు సంబంధించిన వ్యాక్యాల్ని క్యాప్షన్ గా పెట్టుకున్నారు. పాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోను..ఈ యువ జంటను చూసిన వారు కంగ్రాట్స్ అంటూ అభినందలు తెలుపుతున్నారు.
Tags:    

Similar News