సరైనోడికి బొలీవియాలో ఏం పని?

Update: 2016-03-02 12:00 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - రకుల్ ప్రీత్ సింగ్ - కేథరిన్ థ్రెసాలు నటించిన సరైనోడు మూవీ.. ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. టాకీపార్ట్ దాదాపుగా పూర్తి కావడంతో.. ఇప్పుడు మిగిలిన పాటలను కూడా ఫినిష్ చేసేందుకు షెడ్యూల్ ప్లాన్ చేశాడు దర్శకుడు బోయపాటి శ్రీను. సరైనోడులో ఓ పాట చిత్రీకరణ కోసం దక్షిణ అమెరికాలోని బొలీవియా వెళ్లబోతోంది యూనిట్.

సౌత్ అమెరికాలోని అత్యంత అందమైన దేశాల్లో ఒకటిగా బొలీవియాని చెబుతారు. అయితే.. ఈ దేశంలో షూటింగ్ జరుపుకుంటున్న తొలి తెలుగు సినిమాగా సరైనోడు రికార్డ్ సృష్టించనుంది. వచ్చే ఆదివారం నుంచి అల్లు అర్జున్ - రకుల్ ప్రీత్ సింగ్ ల మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ను బొలీవియాలో షూటింగ్ చేయనున్నారు. గణేష్ ఆచార్య ఈ పాటకు డ్యాన్స్ అందించనుండగా.. ఐదు రోజుల్లో ఈ పాటను ఫినిష్ చేయనున్నారని తెలుస్తోంది. అసలు ఈ పాట చిత్రీకరణ కోసం అనేక ప్రాంతాలను పరిశీలించాడు దర్శకుడు బోయపాటి. ఓ ఏజన్సీ నుంచి బొలీవియా సంబంధించిన పిక్చర్స్ - వీడియోస్ - డీటైల్స్ చూసిన తర్వాత.. తను తీయబోయే సాంగ్ కు ఇదే పర్ ఫెక్ట్ లొకేషన్ అని డిసైడ్ అయ్యాడట ఈ డైరెక్టర్.

సరైనోడుని ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే నిర్మాలు  ప్రకటించగా.. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా యాక్ట్ చేయనున్నాడు. త్వరలో ఆడియో రిలీజ్ కి సంబంధించిన డీటైల్స్ ప్రకటించనున్నారు.
Tags:    

Similar News