షాహిద్ కు కూతురు.. శరణ్యకు కొడుకు..

Update: 2016-08-27 06:30 GMT
అబ్బే అవి రెండు న్యూసులు అంతే. ఒకటి బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ గురించి. రెండోది విలేజ్ లో వినాయకుడు వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఈ మధ్యన చెల్లెలి క్యారెక్టర్లు చేస్తున్న శరణ్య గురించి. ఇద్దరి ఇప్పుడు పిల్లలు పుట్టడం.. వారి జీవితాల్లో ఎంతో ఆనందాన్ని నింపిందిలే.

2015లో ఢిల్లీకి చెందిన ఒక కాలేజీ స్టూడెంట్ ను.. తల్లిదండ్రులు ఎరేంజ్ చేసిన పెళ్ళి ద్వారా భార్యగా చేసుకున్నాడు షాహిద్ కపూర్. ఇతగాడిని చేసుకున్నప్పటి నుండీ మీరా రాజ్పుత్ కూడా ఒక సెలబ్రిటీ అయిపోయింది. మనోడు కూడా ఆమెను ర్యాంపులూ గట్రా ఎక్కించి నడిపేశాడు. ఈ జంటకు నిన్న సాయంత్రం ముంబయ్ లో పండంటి ఆడపిల్ల జన్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్న మీరాను.. షాహిద్ కుటుంబసభ్యలు అందరూ తమ విషెస్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

ఇకపోతే 2015లో తన బాయ్‌ ఫ్రెండ్ డాక్టర్ అరవింద కృష్ణన్ ను.. అలెప్పీలోని ఒక గుడిలో సాంప్రదాయబద్దంగా పెళ్ళాడింది హీరోయిన్ శరణ్య. ఈ జంటకు గురువారం ఈవెనింగ్ ఒక పండంటి బాబు జన్మించాడట. ఈ విషయాన్ని స్వయంగా శరణ్య తెలియజేసింది. మాతృత్వం అనేది వర్ణించలేనిదని.. తనకు చాలా ఆనందంగా ఉందని.. ఆమె పేర్కొంది.
Tags:    

Similar News