ప్రీమియర్లు.. సర్దార్ కి ప్లస్సా మైనస్సా?

Update: 2016-04-07 11:30 GMT
సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కు గంటల సమయం మాత్రమే ఉంది. తెల్లవారే లోగానే ప్రపంచవ్యాప్తంగా పవర్ స్టార్ సందడి ప్రారంభమైపోతుంది. తొలిసారిగా పవన్ కళ్యాణ్ మూవీని.. ఇంత భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. భారీ అనే మాట సహజంగా ఉపయోగించేదే అయినా.. బాహుబలి కంటే ఎక్కువగా స్క్రీన్లలో ప్రదర్శించడం అంటే.. అత్యంత భారీ విడుదల అనాల్సిందే. రిలీజ్ విషయంలోనే కాదు.. ప్రీమియర్ షోలలో కూడా సర్దార్ గబ్బర్ సింగ్ కొత్త రికార్డ్ సృష్టిస్తున్నాడు.

యూఎస్ఏలో తొలిసారిగా ఈ చిత్రాన్ని 200 థియేటర్లలో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఇది బాహుబలి కంటే.. ఓవర్సీస్ స్టార్ మహేష్ బాబు చిత్రాన్ని ప్రదర్శించే స్క్రీన్ ల సంఖ్య కంటే ఎక్కువ. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోల హంగామా ప్రారంభమైపోతోంది. ఏపీలో అయితే 400 థియేటర్లలో బెనిఫిట్ షోలు వేస్తున్నారు. తెలంగాణలో ఇంకా లెక్క తేలలేదు కానీ.. ఈ సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఒకో థియేటర్ లో రెండు నుంచి మూడు బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తుండడంతో.. ఫస్ట్ డే రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి రోజు టాక్ ను బట్టి ఈ స్క్రీన్ ల సంఖ్య కంటిన్యూ అవుతుంది. వీకెండ్ వరకూ ఢోకా లేకపోయినా.. ఆ తర్వాత నిలబడ్డం ప్రధానం. కాకపోతే.. ఈ హైప్ వీకెండ్ వరకూ ఉన్నా.. సర్దార్ గబ్బర్ సింగ్ సేఫ్ జోన్ లోకి వచ్చేస్తాడని అంటున్నారు.

ఈ లెక్కలు బాగానే ఉన్నాయి కానీ.. ప్రీమియర్ షోలతోనే అసలు సమస్య మొదలవుతుంది. అక్కడ ప్రీమియర్ షో టాక్ లో ఏదన్నా తేడా వస్తే.. ఇక్కడ వసూళ్ల లెక్కలు డ్రాప్ అయిపోతున్నాయి. అడ్వాన్స్ గా అమ్ముడైపోయిన టికెట్ల లెక్కల్లో వేరియేషన్ ఉండదు కానీ.. మిగిలినవి మాత్రం సేల్ కావు. పైగా రష్ తగ్గిందంటే.. టాక్ తేడా వచ్చేస్తుంది. మరి రికార్డులను పడగొట్టాలంటే సర్దార్ నిలబడాల్సిందే. ఏం చేస్తాడో తెలియడానికి మరికొన్ని గంటలు చాలు.
Tags:    

Similar News