పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమానుల్లో ఉన్న క్రేజుని బాగానే సొమ్ము చేసుకుంటున్నారు సినీ జనాలు. స్టార్ హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు వేయడం మామూలే కానీ.. మరీ ఈ స్థాయిలో అభిమానాన్ని సొమ్ము చేసుకోవడం ఎక్కడా చూసి ఉండం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కనీవినీ ఎరుగని స్థాయిలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు ఏకంగా 350 బెనిఫిట్ షోలు వేస్తుండటం టాలీవుడ్ వర్గాల్నే విస్మయపరుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే 250 దాకా బెనిఫిట్ షోలు వేస్తుండటం విశేషం. అనుమతుల విషయంలో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభిస్తుండటంతో బెనిఫిట్ షోలకు ఏ ఇబ్బందులూ ఉండట్లేదు.
ఒక్క కృష్ణా జిల్లాలో మాత్రమే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బెనిఫిట్ షోల సంఖ్య 44గా ఉండటం విడ్డూరమే. ఇక్కడ శ్రేయాస్ మీడియా సంస్థ పెద్ద ఎత్తున బెనిఫిట్ షోలు ప్లాన్ చేసింది. కేవలం విజయవాడలో మాత్రమే 14 బెనిఫిట్ షోలు ప్లాన్ చేశారు. నగరంలోని మెజారిటీ థియేటర్లలో బెనిఫిట్ షోలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇలాగే భారీగా షోలు పడుతున్నాయి. అర్ధరాత్రి 12 నుంచే కొన్ని చోట్ల షోలు వేయబోతున్నారు. ఇక టికెట్ ధరల విషయంలో ఎవరిష్టం వాళ్లది. డిమాండును బట్టి వెయ్యి రూపాయలకు అటు ఇటుగా వసూలు చేస్తున్నారు. అయినా అభిమానులేమీ వెనక్కి తగ్గట్లేదు. మొత్తంగా బెనిఫిట్ షోల వసూళ్ల విషయంలోనూ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.