‘సర్దార్ గబ్బర్ సింగ్’కు సంబంధించి బ్యాలెన్స్ ఉన్న రెండు పాటల చిత్రీకరణ కోసం యూరప్ కు వెళ్లిన పవన్ కళ్యాణ్ అండ్ కో నిన్నే హైదరాబాద్ తిరిగొచ్చినట్లు చెబుతున్నారు. మరి రెండు పాటల ఔట్ పుట్ అంతా సరిచూసుకుని ఎడిటింగ్ చేసుకుని.. మిక్సింగ్ చేయడానికి రెండు మూడు రోజులైనా పట్టకపోదు. ఐతే ‘సర్దార్’ యూనిట్ సభ్యులు మాత్రం ఈ సినిమాకు ఈ రోజే సెన్సార్ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. మరి ఫారిన్లో తీసుకొచ్చిన పాటలు లేకుండానే సెన్సార్ కానిచ్చేయబోతున్నారా.. లేక ఒక్క రోజు వ్యవధిలో ఆ పాటల పని కూడా పూర్తి చేసేసి ఫైనల్ ఔట్ పుట్ లో కలిపేశారా అన్నది తెలియట్లేదు.
వారం రోజులు ఉండగానే సెన్సార్ అయితే తప్ప అనుకున్న స్థాయిలో ప్రమోషన్ చేసి.. సరైన సమయానికి సినిమాను రిలీజ్ చేయలేమని భావిస్తున్నాడట పవన్. డైరెక్టర్ బాబీని ఇక్కడే ఉంచి మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల మీద దృష్టిపెట్టమంది కూడా అందుకేనట. పవన్ మాట ప్రకారమే బాబీ పర్ఫెక్ట్ గా మిగతా పనులన్నీ పూర్తి చేసేసినట్లు సమాచారం. ఇక పవన్ ఓన్ క్రియేటివిటీ ఉపయోగించిన తీసిన పాటలు రెండూ బాగానే వచ్చాయట. తెలుగు వెర్షన్ సెన్సార్ పని ముగిసిపోతే.. ఇక ఆ తర్వాత హిందీ డబ్బింగ్ పనులు కానిచ్చి.. ముంబయిలో ప్రమోషన్ కార్యక్రమాలవీ చేయాల్సి ఉంది. పవన్ సినిమా అంటే తెలుగులో ఆటోమేటిగ్గా పిచ్చ క్రేజ్ ఉంటుంది కాబట్టి.. ఇక్కడ ఏ ప్రమోషన్ చేయకపోయినా పర్వాలేదు కానీ.. హిందీలో మాత్రం కాస్త హడావుడి చేయాల్సిందే. అందులోనూ హిందీలో పవన్ కు ఇదే తొలి సినిమా కూడానాయె.