ఈ డైరీలు ఏంది గబ్బరూ??

Update: 2016-03-24 04:42 GMT
ఒక సినిమాను ప్రమోట్‌ చేయడానికి రకరకాల పద్దతులు. అదిగో ఆ బాహుబలి రిలీజ్‌ అయినప్పటినుండి.. చాలామంది వరుసగా తమ సినిమాల్లోని చాలా క్యారెక్టర్లను పేర్లతో సహా పరిచయం చేయడం వంటివి చేశారు. కాని బాహుబలికి వర్కవుట్‌ అయినట్లు ఎవ్వరికీ అవి వర్కవుట్‌ కాలేదు.

ఇక ఇప్పుడు సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ ను ఎంత కొత్తగా పరిచయం చేస్తారు అనే విషయానికొస్తే.. మనోళ్లు బాలీవుడ్‌ ప్యాటర్న్‌ ఫాలో అవుతున్నారు. ముందుగా తాము వేసిన రత్తన్‌ పూర్‌ గ్రామం సెట్‌ గురించి ''గబ్బర్‌ సింగ్‌ డయరీస్‌'' అంటూ ఒక మెమాయిర్‌ ను రాసి మీడియాకు పంపారు. నిజానికి ఇలాంటి మెమాయిర్‌ ఏదన్నా వీడియో రూపంలో చేసుంటే చాలా బాగుండేది కాని.. మనోళ్లు మాత్రం 10వ తరగతి పిల్లాడు పబ్లిక్‌ ఎగ్జామ్‌ లో 10 మార్కుల ప్రశ్నకు ఆన్సర్‌ ఇచ్చినట్లు.. టావులు టావులు వ్యాసం ఒకటి రాసిచ్చేశారు. ఆ ఊళ్ళో జనాభా నుండి.. వాళ్లు వాడే మెషీన్లు.. అక్కడున్న ఇళ్ళు.. ఇలా వామ్మో అన్నీ చెప్పారు. కాని ఈ రైటప్‌ వలన సినిమా ప్రమోషన్‌ ఎలా జరుగుతుందో మాత్రం అర్ధం కావట్లేదు.

వాస్తవానికి లార్డ్ ఆఫ్‌ ది రింగ్స్‌ - ది హాబిట్‌ వంటి సినిమాలకు ఎప్పుడో ప్రీ-హిస్టారిక్‌ కాలంలో వేసిన ఊళ్ళ సెట్లను ప్రజలకు అర్ధమయ్యేలా చేసి హైప్‌ తీసుకురావడానికి.. ఇలాంటి డాక్యుమెంట్ల గట్రా విడుదల చేస్తుంటారు. కాని కమర్షియల్‌ మసాలా సినిమాలకు ఇవన్నీ ఎందుకు గురూ?
Tags:    

Similar News