కేక్‌ పై మిక్సీతో మళ్లీ వివాదం రాజేశాడు!

Update: 2018-11-12 13:21 GMT
విజయ్‌ - మురుగదాస్‌ ల కాంబినేషన్‌ లో తెరకెక్కి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సర్కార్‌’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అయినా కూడా ఈ చిత్రం చాలా సింపుల్‌ గా 200 కోట్ల క్లబ్‌ లో చేరింది. సినిమా కలెక్షన్స్‌ తో సక్సెస్‌ సినిమాల జాబితాలో చేరి పోయింది. మరో వైపు ఈ చిత్రంలో ప్రభుత్వం మిక్సీలు - గ్రైండర్లు పంపిణీ చేయడం - సినిమాలోని విలన్‌ పాత్ర మాజీ సీఎం జయలలిత తరహాలో ఉండటంతో అధికార పార్టీ అన్నాడీఎంకే నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సర్కార్‌ చిత్రంలోని ఆ సీన్స్‌ ను తొలగించే వరకు ఊరుకోకుండా ఆందోళనలు చేసి మురుగదాస్‌ తలొగ్గి వాటిని తొలగించేలా చేశారు.

సినిమాలో మిక్సీలు - గ్రైండర్‌ లను తొలగించిన మురుగదాస్‌ కేక్‌ పై పెళ్లి మళ్లీ వివాదాన్ని రాజేశాడు. సర్కార్‌ చిత్రం సక్సెస్‌ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో కేక్‌ కట్‌ చేశారు. కేక్‌ పై ఒక వైపు మిక్సీ మరియు గ్రైండర్‌ పెట్టడంతో సోషల్‌ మీడియాలో మరోసారి ఈ చిత్రం గురించి చర్చనీయాంశం అయ్యింది. సినిమాలో వారికి భయపడి తీశాను కాని, కేక్‌ పై మాత్రం తీసేది లేదు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులతో మురుగదాస్‌ జోక్‌ చేసినట్లుగా సమాచారం అందుతుంది.

కేక్‌ పై మిక్సీ మరియు గ్రైండర్‌ పై ఇంకా అన్నా డీఎంకే కార్యకర్తలు కాని - నాయకులు కాని అధికారికంగా స్పందించలేదు. ఇప్పటికే పెద్ద వివాదాన్ని ఎదుర్కొన్న మురుగదాస్‌ మళ్లీ కేక్‌ పై అవి పెట్టి తాను ఎంత మొండోడినో చెప్పకనే చెప్పాడు. జయలలిత ను అవమానించాడు అంటూ మురుగదాస్‌ ను పోలీసులు అరెస్ట్  చేసే అవకాశం కూడా ఉందని వార్తలు వచ్చాయి. కోర్టుకు వెళ్లి మురుగదాస్‌ ముందస్తు బెయిల్‌ ను కూడా తీసుకునే ప్రయత్నం చేశాడని తమిళనాట ప్రచారం జరిగింది. అంత హైరానా పడ్డ మురుగదాస్‌ మళ్లీ ఇప్పుడు ఇలా కేక్‌ పై వాటిని పెట్టి వివాదాన్ని రేపడం ఆశ్చర్యంగా ఉంది.

సినిమా పబ్లిసిటీ కోసమే మురుగదాస్‌ మళ్లీ వివాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News