సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న మహేష్.. సమ్మర్ లోనే 'సర్కారు వారి పాట'..!
సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ పరశురామ్ పెట్లా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''సర్కారు వారి పాట''. ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. అయితే ఈ సినిమాని వాయిదా వేస్తూ.. తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
ఆక్షన్ కోసం థియేటర్లలో యాక్షన్ కోసం తేదీ లాక్ చేయబడింది.. 'సర్కారు వారి పాట' చిత్రాన్ని 2022 ఏప్రిల్ 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నాం అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో మహేష్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. నిజానికి సర్కారు వారి సినిమాని 2021లోనే విడుదల చేయాలని ప్లాన్ చేశారు కానీ.. కరోనా కారణంగా వర్కవుట్ కాలేదు. 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నాలు చేశారు. అందరికంటే ముందుగానే 'సర్కారు వారి పాట' సినిమా విడుదల కోసం సంక్రాంతి సీజన్ మీద కర్చీఫ్ వేశారు.
అయితే రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాని జనవరి 7న రిలీజ్ చేస్తారని ఎప్పుడైతే ప్రకటించారో ప్రణాళికలన్నీ పూర్తిగా మారిపోయాయి. ఓకే సీజన్ లో అన్ని పెద్ద సినిమాలు విడుదల అవడం మార్కెట్ పరంగా మంచిది కాదని ఆలోచించి 'సర్కారు వారి పాట' చిత్రాన్ని సంక్రాంతి పోటీ నుంచి తప్పించి సమ్మర్ లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ సినిమా కోసం ఏప్రిల్ 1వ తేదీని లాక్ చేశారు.
గతంలో ఏప్రిల్ లో విడుదలైన మహేష్ బాబు సినిమాలు చాలా వరకు ఘనవిజయం సాధించాయి. మరి ఇప్పుడు 'సర్కారు వారి పాట' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. కాగా, హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో దూకుడు మీదున్న మహేష్ నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - బ్లాస్టర్ టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నవీన్ యెర్నేని - వై.రవిశంకర్ - రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట దీనికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. ఆర్.మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. 'సర్కారు వారి పాట' చిత్రంలో సముద్ర ఖని - ప్రకాష్ రాజ్ - వెన్నెల కిషోర్ - సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.