ఓ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పడానికి ప్రీ రిలీజ్ బిజినెస్ ని మించిన ఎగ్జాంపుల్ మరొకటి ఉండదు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సరైనోడు పై ఇండస్ట్రీలో ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి కానీ.. ఏ స్థాయిలో ఉన్నాయో తాజా గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా సీడెడ్ మొత్తానికి సినిమాలకు బిజినెస్ జరుగుతూ ఉంటుంది. కానీ సరైనోడికి జిల్లాల వారీగానే భారీ రేట్లు వస్తున్నాయి.
రీసెంట్ గా బన్నీ సినిమా కోసం కడప జిల్లా థియేట్రికల్ రైట్స్ కోసం కోటీ 80 లక్షల రూపాయలకు డీల్ కుదిరింది. ఇప్పటివరకూ ఉన్న రికార్డులన్నీ ఈ ఫిగర్ తో తుడిచిపెట్టుకుపోయాయని చెప్పాలి. ఎందుకంటే.. ఇక్కడ టాలీవుడ్ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ శ్రీమంతుడు ఫుల్ రన్ లో వసూలు చేసిన మొత్తం కోటీ 71 లక్షలు. మహేష్ సినిమాకు మించి బన్నీ మూవీకి బిజినెస్ జరగడం రికార్డ్ అనే చెప్పాలి. అల్లు అర్జున్ నటించిన గత మూడు సినిమాలు 50 కోట్ల షేర్ వసూలు చేయడంతో.. ఇప్పుడు బన్నీ రేంజ్ అమాంతం పెరిగిపోయిందనే చెప్పాలి.
మరోవైపు మాస్ చిత్రాలు తీయడంలో బోయపాటి శ్రీనుపై ఉన్న నమ్మకాలు కూడా ఇండస్ట్రీలో ఎక్కువే. అందుకే ఇంతగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందంటున్నారు. సరైనోడు అన్ని ఏరియాల్లోనూ ఇలాంటి రికార్డులు నమోదు చేస్తాడనే అంచనాలు ఉన్నాయి. మొత్తానికి టాలీవుడ్ బిజినెస్ లెక్కలన్నిటినీ సరైనోడు సరిచేసేట్టుగానే ఉన్నాడు.