సరైన టైంలో కొడుకుతో సరైన సినిమానే చేసినట్లున్నాడు అల్లు అరవింద్. ఈ సినిమా విషయంలో హైప్ చూస్తుంటే అల్లు అర్జున్ రేంజేంటో అంచనా వేయడం కష్టంగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సూపర్ స్టార్ మహేష్ బాబులకు గట్టి పోటీ ఇచ్చేలా తన స్టార్ పవర్ చూపిస్తున్నాడు బన్నీ. ‘సరైనోడు’ సినిమా ఓవరాల్ గా వంద కోట్ల సినిమా అయ్యేలా కనిపిస్తోంది. తెలుగు వెర్షన్ వరకే ఈ చిత్రం రూ.70-75 కోట్ల దాకా బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు. ఇక మలయాళ వెర్షన్ కు సైతం మంచి రేటే పలికిందని చెబుతున్నారు. ఈ సినిమాను హిందీలో సైతం విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇక ‘సరైనోడు’ శాటిలైట్ రైట్స్ ఎంత పలికాయో తెలిస్తే దిమ్మదిరగడం ఖాయం. ఈ సినిమా కోసం సన్ నెట్ వర్క్ ఏకంగా రూ.16 కోట్లు వెచ్చించినట్లు చెబుతున్నారు. ఐతే అది కేవలం తెలుగు వెర్షన్ కు మాత్రమే కాదు. తెలుగుతో పాటు మలయాళ.. హిందీ హక్కుల్ని కూడా ఒకేసారి కొనుకోలు చేసిందట సన్ నెట్ వర్క్. అలా చూసినా ఇది చాలా పెద్ద డీలే. ఈ మధ్యే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ శాటిలైట్ రైట్స్ రూ.13 కోట్లు పలికాయి. అది నాన్-బాహుబలి రికార్డు. ‘సరైనోడు’ మలయాళం.. హిందీ హక్కుల్ని మైనస్ చేసి చూసినా.. తెలుగు వరకు రూ.12 కోట్లకు అటు ఇటుగా పలుకుతున్నట్లు లెక్క. మహేష్ సినిమా ‘బ్రహ్మోత్సవం’ రూ.11.5 కోట్లకు అమ్ముడైందని అంటున్నారు. అంటే బన్నీ సినిమా మహేష్ మూవీ కంటే కూడా ఎక్కువే తెచ్చినట్లన్నమాట.