మరో శంకరాభరణం అవుతుందా

Update: 2019-03-07 07:55 GMT
ఈ మధ్య కాలంలో తమిళ్ సినిమా స్టాండర్డ్స్ బాగా పెరిగాయని చెప్పొచ్చు. విభిన్న ప్రయోగాలతో కమర్షియల్ సక్సెస్ కొడుతున్న దర్శకులు పరిచయమవుతున్నారు. 96-రట్ససన్-పరియేరుం పెరుమాళ్ వీటికి చక్కని ఉదాహరణలుగా చెప్పొచ్చు. మొదటి రెండు తెలుగులో రీమేక్ కూడా అవుతున్నాయి. కాని కొన్ని డబ్బింగ్ చేస్తేనే అందులో ఒరిజినాలిటిని ఫీలవ్వగలం. ఆ కోవలో వస్తోందే సర్వం తాళ మయం. సంగీత దర్శకుడు జివి ప్రకాష్ హీరోగా రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కోలీవుడ్ క్రిటిక్స్ తో శభాష్ అనిపించుకుని 4 రేటింగ్ తో అదరగొట్టింది. వసూళ్లు లెక్కల్లో అద్భుతాలు చేయకపోయినా ఓ గొప్ప సినిమా వచ్చిందన్న ఫీడ్ బ్యాక్ ని అందుకోవడంలో రాజీవ్ మీనన్ టీం సక్సెస్ అయ్యింది.

ఏఆర్ రెహమాన్ సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచిన సర్వం తాళ మయం ఇటీవలే కె విశ్వనాధ్-చంద్రశేఖర్ యేలేటి-నాగ అశ్విన్-మహి వి రాఘవ తదితరులకు ప్రీమియర్ ప్రదర్శిస్తే అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇంత పాజిటివ్ వైబ్రేషన్స్ మధ్య సర్వం తాళ మయం తెలుగు రాష్ట్రాల్లో రేపు విడుదల కానుంది. శంకరాభరణం స్థాయి విలువలు ఇందులో ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో సంగీతాభిరుచి కలిగిన ప్రేక్షకుల అండ దీనికి దొరికితే మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. చాలా సహజంగా ఉండే ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ దీనికి బలంగా నిలవనుంది.

మృదంగాలు తయారు చేసే కుటుంబంలో పుట్టిన హీరో అది నేర్చుకోవాలన్న పట్టుదలతో లక్ష్యాన్ని ఎలా సాధించాడు అనే పాయింట్ మీద రాజీవ్ మీనన్ దీన్ని తీర్చిదిద్దారు. అపర్ణ బాలమురళి హీరొయిన్ గా నటించిన ఈ మూవీలో మరో ప్రముఖ నటుడు వినీత్ కీలక పాత్ర పోషించడం విశేషం. కళకు పట్టం కట్టే ఇలాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకాన్ని నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. వాటిని ఎంత మేరకు నిలబెట్టుకుంటుందో రేపు తేలనుంది
Tags:    

Similar News