తెలుగు చిత్ర పరిశ్రమ ఆరంభం నుంచి నేటి వరకు ఎందరో తారామణులు వెండితెర మీద మెరిసి ఉంటారు. కోట్లాది మంది మనసుల్ని కొల్లగొట్టి ఉంటారు. కానీ.. ఏళ్లకు ఏళ్లు గడిచిన తర్వాత కూడా ఇప్పటికి మహానటి అన్న పేరు వెంటనే గుర్తుకు వచ్చే పేరు సావిత్రి. నాటి తరమే కాదు నేటి తరం కూడా (మహానటి మూవీ పుణ్యమా అని) ఆమెకు ఫిదా అయ్యే వారే. రీల్ లైప్ మాత్రమే కాదు రియల్ లైఫ్ లోనూ ఆమె ఒక అద్భుతమన్నట్లుగా ఉంటుంది. విషాదభరితమైన ఆమె మరణం మినహాయిస్తే.. ఆమెకు సంబంధించిన విషయాలు.. విశేషాలు.. సావిత్రిని మర్చిపోనివ్వకుండా చేయటమే కాదు.. ఆమెకు ఆజన్మాంతం అభిమానిగా ఉండిపోయేలా చేసే వ్యక్తిత్వం ఆమెకు సొంతం.
అందుకే ఆమె అప్పటికి ఇప్పటికి ఎప్పటికి మహానటిగా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుందని చెప్పాలి. ఇదంతా ఎందుకంటే.. తాజాగా ఆమెకు సంబంధించిన ఒక ఉదంతం బయటకు వచ్చింది. సుదీర్ఘకాలంగా.. అంటే 47 ఏళ్లుగా సాగుతున్న న్యాయపోరాటంలో ఆమెకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. కాకుంటే.. ఆమె మరణించిన దశాబ్దాలు గడిచిపోయాయి. హైదరాబాద్ లోని రూ.450 కోట్ల విలువైన నివాసస్థలం సావిత్రి గణేశ్.. రామస్వామి గణేశ్ లకు చట్టబద్ధమైన ఆస్తిగా నిర్ధారించారు.
ఈ భూమిని సావిత్రి 1967లో తన సోదరి.. ఆమె భర్తకు వచ్చింది. కొంత కాలం తర్వాత అంటే.. ఇచ్చిన నాలుగేళ్ల తర్వాత అప్పట్లో ఆమెకున్న పరిస్థితుల కారణంగా వెనక్కి ఇవ్వాలని కోరితే.. ఆమె సోదరి అందుకు నో చెప్పింది. దీంతో.. 1974లో ఆమె న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. 1980లో ఆమె కేసు ఓడారు. ఏడాది తర్వాత అంటే 1981 లో సావిత్రి వారసులు కేసును రీఫైల్ చేశారు. ఈ కేసు విచారణ హైకోర్టులో విచారణ జరగ్గా.. అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. దీంతో.. 2002లో మరోసారి కేసును నమోదు చేశారు.
ఈ సందర్భంగా సావిత్రి కజిన్ (సోదరి) భూమి కొనుగోలుకు సంబంధించిన ఆధారాలు.. వాటి మూలాల్ని పదిహేనేళ్లుగా సమర్పించలేదన్న కారణంతో హైదరాబాద్ కోర్టు రాజీ చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆస్తికి సంబంధించిన మొత్తాన్ని సావిత్రి.. జెమిని వారసులకు అప్పగించాలని నిర్ణయించారు.
ఇందుకు ప్రతివాదులు సైతం ఓకే చెప్పటంతో సావిత్రి వారసులకు ఒక్కొక్కరికి రూ.163 కోట్లు.. ప్రస్తుత యజమాని సావిత్రి కజిన్ కు రూ.124 కోట్లు ఇవ్వాలని కోర్టు డిసైడ్ చేసింది. మొత్తంగా చూస్తే.. 47 ఏళ్లు తర్వాత సావిత్రి తాను న్యాయం అనుకున్నది న్యాయమన్న విషయాన్ని కోర్టు సైతం అంగీకరించి.. రాజీ చేయటాన్ని సావిత్రమ్మ కూడా సంతసించే ఉండి ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.