నారా రోహిత్ - నందిత జంటగా నటించిన సావిత్రి ఆడియో ఫంక్షన్ సూపర్బ్ గా జరిగింది. ఈ వేడుకలో.. తనకు సోలో తర్వాత అంతటి సినిమా అని చెప్పాడు నారా వారబ్బాయి. అలాగే గెస్ట్ గా వచ్చిన తారకరత్న కూడా సోలో చిత్రంతో పోల్చాడు. అలా ఎందుకు పోల్చారనే విషయం ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
పెద్దగా పజిల్స్ లేకుండా సావిత్రి కాన్సెప్ట్ ఏంటో ట్రైలర్ లోనే చెప్పేశారు. కొత్త స్టోరీ ఏమీ కాదు.. ఆవారా అబ్బాయి - ట్రైన్ లో కనిపించే అమ్మాయిని ప్రేమించడం - ఆమె పెళ్లి సెట్ అవడం - హీరో అక్కడికెళ్లిపోయి ఆ పెళ్లి చెడగొట్టేందుకు ట్రై చేయడం, అక్కడో బకరా కేరక్టర్. కాన్సెప్ట్ లో కొత్తగా ఏమీ లేదు కానీ.. ఆ కేరక్టర్ లో నారా రోహిత్ యాక్షన్ - డైరెక్టర్ పవన్ సాదినేని ట్రీట్ మెంట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణ చైతన్య రాసిన డైలాగ్స్ భలేగా ఆకట్టుకుంటాయి.
'మీది కోపానికి మించిన పట్టుదల అయితే.. నాది పంతానికి మించిన ప్రేమ' అని హీరో అనడం ఆకట్టుకుంటే.. 'చంద్రబాబు గారిని బాలకృష్ణ గారు కూడా ఇన్నిసార్లు బావాబావా అని పిలవలేదురా' అంటూ పోసానితో చెప్పించిన డైలాగ్ భలేగా పేలింది. 'సావిత్రి పెళ్లి, మా ఇంటి పరువు.. రెండూ ఒకటే' అని అజయ్ చెప్పిన తీరు కూడా సూపర్బ్. ఇక యాక్షన్ సీన్స్, విలేజ్ నేటివిటీ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి సోలో కాదు.. అంతకు మించి అనే రేంజ్ లోనే ట్రైలర్ ఉంది.
Full View