అతడిని మార్చేసిన అఖిల్ బ్యూటీ

Update: 2015-12-23 17:30 GMT
అందం కోసం స్పాట్ లు (బ్యూటీ) పెడుతుంటారు కొంతమంది. అలాగే అదృష్టం కోసం చాలామంది పేరులో అక్షరాలు మారుస్తుంటారు. కానీ సినీ ఇండస్ట్రీలో అదృష్టం కలిసిరావాలంటే చేయాల్సిన  పని ఇంకొకటి ఉంటుంది. అదే మేనేజర్ ని మార్చేయడం.

గతంలోనూ కొంతమంది హీరోయిన్లు మేనేజర్ ని మార్చేశాక.. కెరీర్ ని గాడిలో పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడదే రూట్ ని అక్కినేని అఖిల్ తో అఖిల్ మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ముంబై భామ సాయేషా సైగల్ కూడా ఎంచుకుంది. టాలీవుడ్ లో అరంగేట్ర మూవీ డిజాస్టర్ గా మిగలడంతో.. అమ్మడికి అవకాశాలు రాలేదు. దీంతో ప్రస్తుతానికి బాలీవుడ్ పైనే కన్నేసింది. ఇప్పుడు అజయ్ దేవగన్ సరసన శివాయ్ చిత్రంలో నటిస్తోంది సాయేషా. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన వర్క్ పూర్తి కానుండడంతో.. టాలీవుడ్ లో తన సత్తా చాటేందుకు స్కెచ్ రెడీ చేసుకుంటోంది.

ఇప్పుడు చాలామంది హీరోయిన్లు ఫస్ట్ మూవీ చేస్తుండగానే.. తర్వాతి ప్రాజెక్టులు కూడా సైన్ చేసేస్తున్నారు. కానీ సాయేషాకు ఇలా బుక్ అవకపోవడానికి కారణం.. మేనేజర్ మిస్టేక్స్ అని ఎవరో చెప్పారట. అందుకే వీలైనంత త్వరగా మార్చేసి, కొత్త వ్యక్తిని తీసుకోవాలని సూచించడంతో.. వెంటనే ఆ పని చేసేసింది సాయేషా. కొత్త మేనేజర్ గా హరినాథ్ ని తీసుకున్నాక.. కొంతమంది యంగ్ స్టార్లు సాయేషా సైగల్ ని హీరోయిన్ గా తీసుకోనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇదే నిజమైతే.. ముంబై బ్యూటీకి మరో ఛాన్స్ వచ్చినట్లే.

Tags:    

Similar News