ఒక్కసారి తెలుగులో భారీ బ్యాగ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన హీరోల్ని గుర్తుకు తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ - నాగచైతన్య.. వీళ్ల తొలి సినిమాల్లో నటించిన ఏ హీరోయిన్ కూడా తెలుగులో మళ్లీ పెద్దగా అవకాశాలు దక్కించుకోలేదు. దాదాపుగా అందరూ కనుమరుగైపోయారు. ఈ హీరోల తొలి సినిమాల్లో హీరోయిన్లు హైలైట్ అయింది చాలా తక్కువ.
హీరోయిన్లు హైలైట్ అయితే.. హీరోలకు ఇబ్బందవుతుందని.. కావాలనే వాళ్లకు పెద్దగా ఛాన్స్ ఇవ్వలేదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి జనాల్లో. రీజన్స్ ఏవైనప్పటికీ.. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చే హీరో పక్కన హీరోయిన్ గా చేయడం శాపం అన్న అభిప్రాయం మాత్రం బలపడిపోయింది టాలీవుడ్ లో. ఇప్పుడు సాయేషా విషయంలో ఏం జరుగుతుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ ముంబయి అమ్మాయి అఖిల్ సినిమాతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు వచ్చిన అరంగేట్ర హీరోల కంటే అఖిల్ విషయంలో ఫోకస్ ఎక్కువుంది. ముందు నుంచి అతణ్ని హైలైట్ చేయడానికే ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇప్పటిదాకా సాయేషాపై ఎవ్వరూ దృష్టిపెట్టలేదు. అమ్మాయి ఫీచర్స్ అవీ చూస్తుంటే కూడా పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశాలేమీ కనిపించడం లేదు. ఏదో నామమాత్రంగా సినిమాలో ఉందంటే ఉంది అన్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి సినిమా విడుదలయ్యాక అమ్మడి పరిస్థితి ఏమవుతుందో చూడాలి.