ఫీల్ గుల్ మూవీస్ దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్న శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నాగచైతన్య.. సాయి పల్లవితో ‘లవ్ స్టోరీ’ తెరకెక్కించాడు. మహమ్మారి వైరస్ కారణంగా లవ్ స్టోరీ చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఆ సినిమా విడుదల కోసం వెయిట్ చేయకుండా తదుపరి చిత్రంకు సంబంధించిన ఏర్పాట్లలో శేఖర్ కమ్ముల మునిగి పోయాడు. చాలా వారాల క్రితమే ఏషియన్ సునీల్ బ్యానర్ లో మరో చిత్రాన్ని చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.
ఏషియన్ సునీల్ నిర్మాణంలో శేఖర్ కమ్ముల చేయబోతున్న కొత్త సినిమా వెంకటేష్ తో అని వార్తలు వస్తున్నాయి. శేఖర్ కమ్ముల కెరీర్ ఆరంభించినప్పటి నుండి కూడా చిన్న హీరోలు కొత్త హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చాడు. మొదటి సారి శేఖర్ కమ్ముల సీనియర్ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల సినిమాలు చేసిన పెద్ద హీరోలు అంటే వరుణ్ తేజ్ ఇంకా నాగచైతన్య మాత్రమే. అలాంటిది ఇప్పుడు వెంకటేష్ తో చేయబోతున్నాడు.
ఫిదాతో మొదటి సారి పూర్తి స్థాయి కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని తెరకెక్కించిన శేఖర్ కమ్ముల వెంకటేష్ తో మరో ప్రయోగానికి సిద్దం అవుతున్నాడు. శేఖర్ కమ్ముల గత చిత్రాలకు ఇది చాలా విభిన్నంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం నారప్ప చిత్రాన్ని చేస్తున్న వెంకటేష్ ఆ తర్వాత శేఖర్ కమ్ములకు డేట్లు ఇచ్చే అవకాశం ఉందట. వచ్చే ఏడాది చివరి వరకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా.